Vijay Devarakonda: ‘ఖుషి’ ముందే అలా - రెమ్యునరేషన్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా ప్రెస్ మీట్ లో తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Continues below advertisement

Vijay Devarakonda Shocking Comments On His Remunaration : రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'గీత గోవిందం' మూవీ ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ తో విజయ్ దేవరకొండ రెండోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ దగ్గర పడడంతో విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ తో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Continues below advertisement

'ఖుషి' తర్వాతే నా మార్కెట్ కి తగ్గ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా

"ఖుషి నుంచి జెన్యూన్ గా డబ్బులు చూడటం మొదలుపెట్టా. దానికంటే ముందు ఎలా ఉండేదంటే ఒక అవుట్ సైడర్ గా మనం డబ్బులు గురించి మర్చిపోవాలి. మన స్థాయి సెట్ చేసుకోవాలి, మన పర్ఫామెన్స్ మన సినిమాలు, అందులోని వర్క్ మాట్లాడాలి. బయట నేను చాలా విన్నా, వీడికి సినిమాకి ఇంత వచ్చింది అని.. కానీ అది నిజం కాదు ఖుషి కంటే ముందు వరకు నేను చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడ్ని" అని అన్నాడు.

కోవిడ్ టైమ్ లో సినిమాలు ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా..

"నేను ఒకే సమయంలో ఒక్క సినిమా మాత్రమే చేసే వాడిని ఇక కోవిడ్ టైంలో సినిమాలు ఆగిపోవడం వల్ల ఎంతో కొంత మ్యానేజ్ చేసేవాడ్ని. కానీ ఆగిపోయిన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. అదే టైంలో నాకు స్టాఫ్ ఎక్కువ అయ్యారు. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. వీటన్నింటి వల్ల ప్రస్తుతం నా మార్కెట్ కి తగ్గ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. ప్రజెంట్ నా మార్కెట్ ప్రైస్ కి తగ్గట్టు కంఫర్టబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

నిర్మాత గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టే విజయ్ తో ఇంకా రెండు సినిమాలు చేస్తున్నా - దిల్ రాజు

" ప్రొడ్యూసర్ కి డబ్బు మిగిలి ఖచ్చితంగా డబ్బు మిగులుతది అని అన్నప్పుడు.. సర్, నాకు ఇంత ఇవ్వండి.. మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ అని ఫిక్స్ చేస్తాడు. ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈ రోజు నేను విజయ్ తో ఈ సినిమా ఇంకా రెండు సినిమాలు చేయబోతున్నా" అంటూ నిర్మాత దిల్ రాజు విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read : 'టిల్లు స్క్వేర్’ టీమ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించిన చిరంజీవి - ఇది ‘అడల్ట్’ కాదు, అందరూ చూడొచ్చు!

Continues below advertisement