మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' (Vishwambhara Movie). సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఇది. దీనికి వశిష్ఠ మల్లిడి దర్శకుడు. బ్లాక్ బస్టర్ 'బింబిసార' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...


లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్...
యాక్షన్ షెడ్యూల్ షురూ!
Chiranjeevi is gearing up for action in the upcoming socio fantasy movie Vishwambha: చిరంజీవి ఇమేజ్, ఆయన మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని 'విశ్వంభర'లో దర్శకుడు వశిష్ఠ లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారని చిత్ర బృందం తెలియజేసింది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 


ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు కొంత మంది ఫైటర్లు పాల్గొనగా... రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో కీలక యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అది భారీ ఎత్తున! సినిమాలో ఈ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ స్పెషల్ హైలైట్ కానుందని నిర్మాతలు తెలిపారు. అదీ సినిమాలోని కీలక సందర్భంలో వస్తుందట.


Also Read: బాలయ్య టైటిల్‌తో శర్వానంద్ సినిమా - హీరోయిన్లు ఇద్దరిలో ఒకరికి వరుస హిట్లు, ఇంకొకరికి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు






హైదరాబాద్ సిటీలో కొన్ని రోజుల క్రితం 'విశ్వంభర' షెడ్యూల్ ఒకరి జరిగింది. అందులో చిరు, త్రిష మీద పాటతో పాటు ఒక యాక్షన్ బ్లాక్, కొంత టాకీ పూర్తి చేశారు. ఈ సినిమాలో మొత్తం 18 సెట్స్ వేశారని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు నిర్మాతలు తెలిపారు.


Also Readఈ నెలలోనే విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్... ZEE5లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?



చిరంజీవికి జోడీగా త్రిష...
'విశ్వంభర'లో చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. 'స్టాలిన్' విడుదలైన 18 ఏళ్లకు మళ్లీ ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాక్. వాళ్లను పక్కన పెడితే... చిరు చెల్లెళ్లుగా శర్వానంద్ 'ఎక్స్‌ ప్రెస్ రాజా', ధనుష్ 'రఘువరన్ బీటెక్', నాని 'జెంటిల్ మన్' ఫేమ్ సురభితో పాటు ఇషా చావ్లా, రమ్య పసుపులేటి నటిస్తున్నారని తెలిసింది. చిరుకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారట. 


ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.