Siren 108 in Telugu OTT Streaming and Release Update: కోలీవుడ్ స్టార్ హీరో 'జయం' రవి లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ 'సైరెన్'.. 108 (Siren OTT) అనేది ట్యాగ్ లైన్. మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh Siren)ప్రధాన పాత్రలో, అనుపమ పరమేశ్వరన్ కీ రోల్లో నటించింది. తమిళ్ డైరెక్టర్ ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హెమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుజాత విజయ్ కుమార్ నిర్మించారు. క్రైం రీవెంజ్ డ్రామా రూపొందిన ఈ సినిమా తమిళంలో ఫిబ్రవరి 16న విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వర్ రేర్ కాంబినేషన్‌లో పైగా మహానటి పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించింది. దీంతో ఈ మూవీపై తెలుగు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా రూపొందుతున్న సినిమా 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సగర్వంగా సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై 'బన్నీ' వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా విడుదలపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన సినిమా 'హను - మాన్'. బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. ఈ ఏడాది (2024లో) తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బడ్జెట్ లెక్కలతో కంపేర్ చేస్తే... నిర్మాతకు బోలెడు లాభం తెచ్చిన సినిమాల లిస్టులోనూ ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది. 'హనుమాన్' సినిమా చివర్లో దానికి సీక్వెల్ 'జై హనుమాన్' చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అప్డేట్ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రామాయణం తెలియని ప్రజలు, మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామ చంద్రుని గురించి తెలియని భక్తులు ఉండరు. తరతరాలకు తరగని తేజస్సు శ్రీరాముని సొంతం. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చెబుతూ రామాయణం ఆధారంగా మన భారతదేశంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాటలో నడుస్తూ మరో ఆ శ్రీరామ చంద్రుని రామాయణంను తెరకెక్కించటానికి నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) సిద్ధం అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
OTT And Theatrical Telugu Movie Releases: ఈ వారం సినిమా అభిమానులకు పంగడే పండుగ. థియేటర్లలో మూడు, నాలుగు సినిమాలే విడుదల అవుతున్నాయి. అవి కూడ పెద్ద సినిమాలేమీ కాదు. అన్నీ చిన్న సినిమాలే. ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు అలరించబోతున్నాయి. ఏకంగా 15కు పైగా చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవాళ రేపు, పలు సినిమాలు ఆడియెన్స్ ను అలరించనున్నాయి. వాటిలో హిందీ మూవీ ‘ఆర్టికల్ 370‘, తెలుగు డబ్బింగ్ మూవీ ‘సైరన్‘తొ పాటు ‘రామ అయోధ్య‘ డాక్యుమెంటరీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వెబ్ సిరీస్ ఇంతకీ ఏ సినిమాలు, ఎప్పుడు? ఎక్కడ? విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)