ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన సినిమా 'హను - మాన్'. బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. ఈ ఏడాది (2024లో) తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బడ్జెట్ లెక్కలతో కంపేర్ చేస్తే... నిర్మాతకు బోలెడు లాభం తెచ్చిన సినిమాల లిస్టులోనూ ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది. 'హనుమాన్' సినిమా చివర్లో దానికి సీక్వెల్ 'జై హనుమాన్' చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అప్డేట్ ఇచ్చారు. 


'జై హనుమాన్' ప్రీ లుక్ వచ్చేసింది
Jai Hanuman Movie Pre Look: శ్రీ రామునికి హనుమంతుడు వీరభక్తుడు. రామ చంద్రుడు అంటే ఎంత భక్తి అంటే సీతా సమేత రాముణ్ణి తన గుండెల్లో కొలువై ఉంచుకున్నారు. శ్రీరామ నవమి కంటే హనుమంతుడి గురించి తీస్తున్న సినిమా గురించి అప్డేట్ ఇవ్వడానికి మంచి సందర్భం ఏముంటుంది చెప్పండి?


శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు 'జై హనుమాన్' ప్రీ లుక్ విడుదల చేశారు. అంతే కాదు... ''త్రేతాయుగంలో చేసిన ఓ ప్రామిస్ (వాగ్ధానాని)కి ఇప్పుడీ కలియుగంలోనూ కట్టుబడి ఉంటున్నారు. ఇప్పటికీ ఇచ్చిన మాటను కాపాడుకుంటున్నారు'' అని రామ హనుమంతుల మధ్య బంధం గురించి చెప్పారు.


Also Read: అల్లు అర్జున్ వీరాభిమానిగా సన్నాఫ్ సుబ్రమణ్యం... ఒక్క పాటలో బన్నీ సినిమాల్లో బెస్ట్ సీన్స్!






వాక్యం ధర్మానికి రక్షణ! 
'वचनं धर्मस्य रक्षणं'... వాక్యం ధర్మానికి రక్షణ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఈ సినిమాలో రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ప్రధానంగా ఉండబోతుందని ఆ వాక్యం బట్టి అర్థం అవుతోంది. ఇంకా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... ''ప్రతి ఒక్కరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని దివ్య ఆశీసులతో... జీవితాంతం గుర్తుంచుకునే సినిమా అందిస్తానని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నా'' అని చెప్పారు.


Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!



'హనుమాన్' టైటిల్స్ కార్డ్స్ గుర్తు ఉన్నాయా? సినిమా ప్రారంభంలో 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU) అని వేశారు. ఆ ఫ్రాంచైజీలో చాలా మంది సూపర్ హీరోలు ఉంటారని, వరుసగా ఇండియన్ మైథాలజీ నేపథ్యంలో సినిమాలు తీస్తానని ప్రశాంత్ వర్మ చెప్పారు. 'జై హనుమాన్' సినిమాలో హీరో, హనుమంతుని పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది... 2025లో సినిమాను విడుదల చేస్తామని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.


Also Readవందే భారత్ ట్రైనులో సిగరెట్ కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ... తస్మాత్ జాగ్రత్త, ఇది మీ కోసమే