OTT And Theatrical Telugu Movie Releases: ఈ వారం సినిమా అభిమానులకు పంగడే పండుగ. థియేటర్లలో మూడు, నాలుగు సినిమాలే విడుదల అవుతున్నాయి. అవి కూడ పెద్ద సినిమాలేమీ కాదు. అన్నీ చిన్న సినిమాలే. ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు అలరించబోతున్నాయి. ఏకంగా 15కు పైగా చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవాళ రేపు, పలు సినిమాలు ఆడియెన్స్ ను అలరించనున్నాయి. వాటిలో హిందీ మూవీ ‘ఆర్టికల్ 370‘, తెలుగు డబ్బింగ్ మూవీ ‘సైరన్‘తొ పాటు ‘రామ అయోధ్య‘ డాక్యుమెంటరీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వెబ్ సిరీస్ ఇంతకీ ఏ సినిమాలు, ఎప్పుడు? ఎక్కడ? విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం.


థియేటర్లలో అలరించే సినిమాలు


1. పారిజాత పర్వం - ఏప్రిల్ 19న విడుదల


చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పారిజాత పర్వం’. సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  


2. శరపంజరం- ఏప్రిల్ 19న విడుదల


నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూనే, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘శరపంజరం’. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది.   


3. మార‌ణాయుధం- ఏప్రిల్ 19న విడుదల


మాలాశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారణాయుధం’. ఇందులో మాలాశ్రీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.   


ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు


నెట్ ఫ్లిక్స్


1. ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 15న విడుదల


2. అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17న విడుదల


3. ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) - ఏప్రిల్ 17న విడుదల


4. రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 19న విడుదల


డిస్నీ ప్లస్ హాట్ స్టార్


1. సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17న విడుదల


2. ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17న విడుదల


3. చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 19న విడుదల


4. సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఏప్రిల్ 19న విడుదల


ఆహా


1. రామ ఆయోధ్య- డాక్యుమెంటరీ వెబ్ సిరీస్- ఏప్రిల్ 17న విడుదల


2. మై డియర్ దొంగ- ఏప్రిల్ 19న విడుదల


లయన్స్ గేట్ ప్లే


1. డ్రీమ్ సినిమారియో (హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 19న విడుదల


2. ద టూరిస్ట్ (వెబ్ సిరీస్ 2) - ఏప్రిల్ 19న విడుదల


జియో సినిమా


1. ఆర్టికల్ 370 (హిందీ మూవీ)- ఏప్రిల్ 19న విడుదల


2. ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19


జీ5
1. కామ్ చాలు హై (హిందీ సినిమా) - ఏప్రిల్ 19న విడుదల


2. డిమోన్స్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 19న విడుదల


Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు