రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేసుకున్న విశ్వక్‌ సేన్‌ 'గామి' - థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే..


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. క్లాస్, మాస్ ఏదైనా ఆ క్యారెక్టర్‌ పరకాయ ప్రవేశం చేస్తాడు మాస్‌ కా దాస్‌. అయితే తన బాడీ లాంగ్వెజ్‌కి అప్ట్‌ అయ్యే మాస్‌ రోల్స్‌ చేస్తూ వస్తున్న విశ్వక్‌ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. మాస్‌ కా దాస్‌గా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న విశ్వక్‌ ఈసారి 'గామి' అంటూ సరికొత్త జానర్‌తో వస్తున్నాడు. ఇందులో విశ్వక్‌ అఘోరగా కనిపించనున్నట్టు ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చేసింది. ఇక మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతుంది. ఈ క్రమంలో గామి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి సినీ లవర్స్‌లో క్యూరియసిటీ పెంచారు. మహా శివరాత్రి సందర్భంగా 'గామి'ని థియేటర్లోకి తీసుకువస్తున్నారు. మార్చి 8న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మూవీ యూనిట్‌ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'ఈగల్‌' కొత్త ట్రైలర్‌ చూశారా? - పద్దతిగా దాడి చేసిన రవితేజ


మరో రెండు రోజుల్లో ఈగల్‌తో బాక్సాఫీసుపై దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మాస్‌ మహారాజా రవితేజ. ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన 'ఈగల్' ఫిబ్రవరి 9న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. మూవీ రిలీజ్‌కు ఇంకా రెండు రోజులు ఉందనగా ఊహించని అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసేందు మాస్ మహారాజా పద్దతైన దాడితో వచ్చాడు. ఈగల్‌ రెండో ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌లో మరింత ఊపు ఇచ్చేలా మలిచాడు డైరెక్టర్‌. ఈ కొత్త ట్రైలర్‌ రవితేజ పూర్తి యాక్షన్‌ మోడ్‌లో కనిపించాడు. ఇందులో రవితేజ యాక్షన్‌, మాస్‌ లుక్‌ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. పూర్తి యాక్షన్‌గా సీక్వెన్స్‌తో ఈ కొత్త ట్రైలర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. మూవీ టైటిల్‌కు తగ్గట్టుగానే గద్ద ఎగురుతూ వెళుతున్న సీన్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఆ తర్వాత నటుడు శ్రీనివాస్‌ చెప్పిన 'మ్యాథ్స్‌, సైన్స్‌కి అందని ఒక రీసెర్చ్‌ ఉంది సార్‌.. అక్కడ ఒకడుంటాడు" అనే డైలాగ్‌ రావడంతో రవితేజ ఎంట్రీ ఇస్తాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


జాన్వీకి మరో బిగ్ ఆఫర్ - మరో పాన్ ఇండియా హీరోతో రొమాన్స్?


అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'ధడక్‌' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత 'గుంజన్‌ సక్సేనా, రూహి, మిలీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా 'తంగం'అనే పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే దేవర నుంచి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో జాన్వీ కపూర్ నటిస్తున్న ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజా సమాచారం ప్రకారం జాన్వి కపూర్ కి తెలుగులో మరో బిగ్ ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు


కుమారి ఆంటీ... ఇప్పుడు ఈమె గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు. మీడియాలో, సోషల్ మీడియాలో ఆవిడ పాపులర్. కుమారి ఆంటీ అడ్రస్ ఎక్కడ? అని కనుక్కుని మరి ఆవిడ దగ్గర భోజనం చేయడానికి చాలా మంది వెళుతున్నారు. దాంతో దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది. క్యూ లైన్లో నిలబడి కుమారి ఆంటీ దగ్గర భోజనాలు చేస్తున్న జనాలు ఉన్నారు. ఆ పాపులారిటీ తెలుసుకున్న 'ఊరు పేరు భైరవకోన' సినిమా టీం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్ళింది.'వివాహ భోజనంబు' రెస్టారెంట్లలో హీరో సందీప్ కిషన్ పార్ట్నర్! ఆ పేరుతో ఆయన ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు. తనకు రెస్టారెంట్ ఉన్నప్పటికీ... 'ఊరు పేరు భైరవకోన' సినిమా ప్రచారం కోసం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్లారు హీరో సందీప్ కిషన్. ఆయనతో పాటు దర్శకుడు వీఐ ఆనంద్, హీరోయిన్లు కావ్య థాపర్, వర్ష బొలమ్మ కూడా వెళ్లారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘ఫ్యామిలీ స్టార్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న విజయ్!


టాలీవుడ్‌లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’తో యూత్‌కు ఆకట్టుకున్న తర్వాత ‘గీత గోవిందం’ లాంటి చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యాడు. ఇక ఈ హీరోకు చాలాకాలం నుండి సరైన హిట్ దక్కడం లేదు. అందుకే తనకు ‘గీత గోవిందం’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడితోనే ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాను చేయడానికి సిద్ధమయ్యాడు. ఏప్రిల్‌లో విడుదలను ఖరారు చేసుకున్న ఈ మూవీ.. అప్పుడే ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేసింది. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ నుండి మొదటి పాటకు సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఇక పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందో.. ఆ వివరాలను కూడా షేర్ చేసింది మూవీ టీమ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)