Ooru Peru Bhairavakona actress Varsha Bollamma reacts on Kumari Aunty Issue: కుమారి ఆంటీ... ఇప్పుడు ఈమె గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు. మీడియాలో, సోషల్ మీడియాలో ఆవిడ పాపులర్. కుమారి ఆంటీ అడ్రస్ ఎక్కడ? అని కనుక్కుని మరి ఆవిడ దగ్గర భోజనం చేయడానికి చాలా మంది వెళుతున్నారు. దాంతో దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది. క్యూ లైన్లో నిలబడి కుమారి ఆంటీ దగ్గర భోజనాలు చేస్తున్న జనాలు ఉన్నారు. ఆ పాపులారిటీ తెలుసుకున్న 'ఊరు పేరు భైరవకోన' సినిమా టీం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్ళింది.
కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసిన సందీప్ కిషన్!'వివాహ భోజనంబు' రెస్టారెంట్లలో హీరో సందీప్ కిషన్ పార్ట్నర్! ఆ పేరుతో ఆయన ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు. తనకు రెస్టారెంట్ ఉన్నప్పటికీ... 'ఊరు పేరు భైరవకోన' సినిమా ప్రచారం కోసం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్లారు హీరో సందీప్ కిషన్. ఆయనతో పాటు దర్శకుడు వీఐ ఆనంద్, హీరోయిన్లు కావ్య థాపర్, వర్ష బొలమ్మ కూడా వెళ్లారు.
'ఊరు పేరు భైరవకోన' సినిమా టీం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత ఆవిడ మరింత పాపులర్ అయింది. ప్రజల తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక దశలో ఆవిడ స్టాల్ మూసేశారు కూడా. ఆ విషయం హీరోయిన్ వర్షా బొల్లమ్మ దగ్గర ప్రస్తావించగా... ''కుమారి ఆంటీ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు. ఆవిడ పాపులర్ కావడానికి కారణం కూడా మేము కాదు. మేము వెళ్లేసరికి ఆవిడ పాపులర్. పాపులర్ కాబట్టే మా టీం అందరం వెళ్ళాం. ఒకవేళ మేము వెళ్ళినా వెళ్లకపోయినా సరే ఆవిడ పాపులర్ అయ్యేది'' అని వర్ష సమాధానం ఇచ్చారు.
Also Read: 'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే
ఫిబ్రవరి 16న 'ఊరు పేరు భైరవకోన' విడుదల'ఊరు పేరు భైరవకోన' సినిమాను తొలుత ఈ శుక్రవారం విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 'ఈగల్' సినిమాకు సోలో రిలీజ్ కావాలని ఫిల్మ్ ఛాంబర్ కోరడంతో తమ సినిమాను వారం వాయిదా వేశారు. ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు.
Also Read: షాక్ ఇచ్చిన విశాల్ - రాజకీయాలపై కీలక ప్రకటన
'సామజవరగమన' విడుదల తర్వాత రాజేష్ దండా నిర్మించిన సినిమా కావడం, ఈ చిత్రానికి అగ్ర నిర్మాత అనిల్ సుంకర భాగం కావడం, ప్రచార చిత్రాలు, పాటలు హిట్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ నేచురల్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం'తో దర్శకుడు వీఐ ఆనంద్ విజయాలు అందుకున్నారు. మరోసారి అటువంటి కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో, సినిమా విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.
Also Read: ప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?