Ram Charan and Samantha reunion: ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు రామ్ చరణ్. మార్చి చివరి నాటికి ఆ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చేపేయనున్నారట చర్రీ. ఇక ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసం కసరత్తులు మొదలుపెడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. అదే చెర్రీ, సమంత కలిసి నటిస్తున్నారనే వార్త.
'రంగస్థలం' మ్యాజిక్ రిపీట్..
2018లో రిలీజైన 'రంగస్థలం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబుగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆయన సరసన నటించిన సమంత కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఇప్పుడు ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. RC16లో సమంత, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, అధికారికంగా దీనికి సంబంధించి ఇంకా ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఆ సినిమాకి సుకుమార్ డైరెక్టర్ కాగా.. బుచ్చిబాబు స్క్రిప్ట్ అందించారు.
స్పోర్ట్స్ డ్రామాగా ఆర్సీ 16
రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ దాదాపు నాలుగేళ్లుగా కథ సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలనే ఉద్దేశంతో కథను రూపుదిద్దుతున్నారట బుచ్చిబాబు. అందుకే, నటీనటుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే.. ఇప్పటికే ప్రముఖ కన్నడ నటుడు శివారాజ్ కుమార్ ని కన్ఫామ్ చేశారు. ఎ.ఆర్.రెహ్మాన్ ఇప్పటికే మ్యూజిక్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వార్త బయటికి వస్తూనే ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక విజయ్ సేతుపతి కూడా కన్ఫామ్ అయ్యాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు సమంత ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..
'RRR' తర్వాత రామ్ చరణ్ సినిమాలకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ బయటికి రాలేదు. 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు గడుస్తున్నా టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేయలేదు మేకర్స్. దీంతో పుట్టిన రోజు నాటికి షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్న నేపథ్యంలో చెర్రీ పుట్టిన రోజుకు ట్రీట్ ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్‌డేట్ ఏమైనా ఇస్తే బాగుండని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
శంకర్ దర్వకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఒక పవర్‌ఫుల్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నారు. ఎన్నికల రిఫామ్స్, ఓటింగ్ ప్రాసెస్ తదితర అంశాల్లో మార్పు తీసుకొచ్చే ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు చెర్రీ. అయితే, ఇది ఏ పార్టీని విమర్శించేలా ఉండదని చిత్ర బృందం చెప్తోంది.
Also Read: 'రామాయణ' నుంచి సాయిపల్లవి ఔట్? సీతగా జాన్వీ కపూర్