Eagle movie ticket price in multiplex and single screen: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఈగల్' థియేటర్లలో సందడి చేయడానికి ఇంకెన్నో గంటలు దూరంలో లేదు. ఆల్రెడీ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ నెలకొంది. దానికి తోడు సినిమా చూసిన తర్వాత 'అయామ్ సూపర్ శాటిస్‌ఫైడ్' అంటూ రవితేజ వన్ సెంటెన్స్ రివ్యూ ఇవ్వడంతో అంచనాలు పెరిగాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు కూడా ప్లస్ అయ్యేలా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


మాసోడి సినిమాకు టికెట్ రేట్లు పెంచలేదు
స్టార్ హీరోల సినిమాలకు ఈ మధ్య టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు అందరికీ అందుబాటులో 'ఈగల్' సినిమాను ఉంచుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మాసోడి సినిమాకు మామూలు టికెట్ రేట్లు ఉంచింది.


హైదరాబాద్ పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'ఈగల్' టికెట్ రేటు రూ. 200 మాత్రమే. ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల 175 రూపాయలే. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే... బాల్కనీ రేటు రూ. 150 మాత్రమే. స్క్రీన్ ముందు ఉండే నెల టికెట్ రేటు 50 రూపాయలే. ఏఎంబీ, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వంటి ఒకట్రెండు చోట్ల మాత్రమే రూ. 295 ఉంది.


ఏపీలోనూ 'ఈగల్' టికెట్ రేట్లు పెంచలేదు. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 110 మాత్రమే ఉంది. కొన్ని థియేటర్లలో 145 రూపాయలు పెట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెండు మూడు మల్టీప్లెక్స్‌లలో తప్ప మిగతా చోట్ల సాధారణ టికెట్ రేట్లు ఉన్నాయి. విశాఖలోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. 


ట్రెండ్ చూస్తుంటే... 'ధమాకా' మేజిక్ రిపీట్ చేసేలా!
'ఈగల్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఇంతకు ముందు రవితేజతో ఆయన 'ధమాకా' తీశారు. ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమాల్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రజెంట్ 'ఈగల్' మీద నెలకొన్న బజ్, అడ్వాన్స్ ట్రెండ్ చూస్తుంటే 'ధమాకా' మేజిక్ రిపీట్ చేసేలా ఉన్నాయి.


Also Readపవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే, చేతిలో గాజు గ్లాసు చూశారా - రిలీజ్ డేట్‌తో ఓజీ కొత్త పోస్టర్


'ఈగల్' తర్వాత రవితేజతో మరో సినిమా చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'బచ్చన్ సాబ్' నిర్మిస్తోంది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధమని రవితేజ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు. హీరో, నిర్మాత మధ్య మంచి బాండింగ్ కుదిరింది.


Also Read: కొత్తగా రవితేజతో 'ఈగల్'లో రొమాన్స్, సీన్స్... కావ్య థాపర్ ఇంటర్వ్యూ






'ఈగల్'కు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాత. ఈ సినిమాలో రవితేజ సరసన కావ్య థాపర్ నటించారు. మరో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కీలక పాత్ర చేశారు. నవదీప్, అజయ్ ఘోష్, వినయ్ రాయ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు.