నో డౌట్... ఈ ఏడాది సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్త సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. సెప్టెంబర్ 2న జనసేనాని బర్త్ డే! ఆ సమయానికి 'ఓజీ' ఫీవర్ ఓ రేంజ్‌కు చేరుకోనుంది. ఇక విడుదల తేదీతో పాటు ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉందని చెప్పవచ్చు. కిర్రాక్ లుక్‌లో హీరోని చూపించిన తీరు బావుంది.


సెప్టెంబర్ 27న 'ఓజీ' విడుదల
OG Movie Release Date: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'రన్ రాజా రన్', ప్రభాస్ 'సాహో' సినిమాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఓజీ' (అంటే... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫుల్ టైటిల్. డీవీవీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని కొన్ని రోజులుగా వినబడుతోంది. ఈ రోజు అధికారికంగా విడుదల తేదీ వివరాల్ని వెల్లడించారు. 


చేతిలో జనసేన గుర్తు గాజు గ్లాసు చూశారా?
ఓజీ రిలీజ్ డేట్ పోస్టర్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. తమ ఫేవరేట్ హీరో స్టైలిష్ లుక్ నచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అభిమానుల్ని ఆకర్షించిన మరొక అంశం ఏమిటంటే... పవన్ చేతిలో గాజు గ్లాసు. అది జనసేన పార్టీ గుర్తు కావడం డిస్కషన్ టాపిక్ అయ్యింది. పవన్ ఇంతకు ముందు నటించిన కొన్ని సినిమాల్లోనూ ఆయన చేతిలో గాజు గ్లాసు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.


Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి మద్దతుగా జ్యోతిక 'అమ్మ ఒడి'... టీడీపీని టార్గెట్ చేశారా?



పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్
'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ జోడిగా తమిళ కథానాయిక ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. ఇంతకు ముందు తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా చేశారామె. శర్వానంద్ 'శ్రీకారం' కూడా! శివకార్తికేయన్ 'డాక్టర్' (తెలుగులో 'వరుణ్ డాక్టర్'గా విడుదలైంది), 'డాన్' సినిమాలు ఆమెకు భారీ విజయాలు అందించాయి. ఇంకా 'ఓజీ'లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, వెంకట్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 


Also Readజగన్ నవ్వారు, అంతే! సీరియస్‌గా తీసుకోలేదు - 'యాత్ర 2' దర్శకుడు మహి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ



ఆల్రెడీ విడుదలైన 'ఓజీ' వీడియో గ్లింప్స్ 'హంగ్రీ చీతా'కు తమన్ ఎక్స్ట్రాడినరీ ట్యూన్ ఇచ్చారు. అది సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాలో పవన్ కళ్యాణ్ చేత ఒక పాట పాడించే ఆలోచనలో ఉన్నామని, అందుకు తగ్గ అవకాశాలను పరిశీలిస్తున్నామని తమన్ ఇటీవల వెల్లడించారు. ఈ సినిమా కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. 


Also Readఉపాసన తాతయ్య బయోపిక్‌ రామ్ చరణ్ చేస్తారా? భర్త గురించి ఉపాసన ఏమన్నారంటే?