Upasana Konidela about Ram Charan: రామ్ చరణ్, ఉపాసన పెళ్లయ్యి దాదాపు 11 ఏళ్లు అవుతోంది. పెళ్లయిన పదేళ్ల తర్వాత వీరిద్దరూ బిడ్డకు జన్మనివ్వాలని డిసైడ్ అయ్యారు. వీరికి పుట్టిన బిడ్డకు క్లిన్ కారా అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక క్లిన్ కారా పుట్టినప్పటి నుండి మెగా ఫ్యామిలీని అదృష్టం వరించింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దానిపై ఉపాసన కొణిదెల స్పందించారు. తన ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా ఎదుర్కుంటారో బయటపెట్టారు. రామ్ చరణ్, క్లిన్ కారాతో తనకు ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు.


ఆ విషయంలో నేను డబుల్ గ్రేట్..


‘‘బిడ్డకు జన్మనివ్వడం అందరికీ సంతోషాన్నిస్తుంది. కానీ నేను మాత్రం ఈ విషయంలో డబుల్ గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నా కెరీర్‌కు, బిడ్డకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది మాకెందుకు పిల్లలు పుట్టలేదని అడుగుతూ ఉండేవారు, ఏదైనా ఇబ్బంది ఉందేమో అనుకునేవారు. కానీ కాదు. మా బిడ్డకు మేము శారీరకంగా, మానసికంగా అందుబాటులో ఉండాలని అనుకున్నాం. సక్సెస్ అవ్వాలనుకున్నాం. రెండిటికీ సమానంగా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం’’ అని తల్లి అవ్వడంపై తన సంతోషాన్ని బయటపెట్టారు ఉపాసన. మెగా ఫ్యామిలీ చాలా సక్సెస్ అయ్యింది అని అందరూ ప్రశంసిస్తుండగా.. చాలామంది ఆ సక్సెస్‌ను మాత్రమే చూస్తున్నారని, దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ కూడా ఉందని అన్నారు.


అంతా రాజమౌళి వల్లే..


ఏ కుటుంబం అయినా కలిసుంటే ఏ శక్తి తమను ఆపలేదని అన్నారు ఉపాసన. ‘‘మేము సంతోషకరమైన సందర్భాలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. కష్ట సమయాల్లో మేము మరింత ధృడంగా కలిసి నిలబడతాం. అదే మంచి ఫ్యామిలీని తయారు చేస్తుందని అనుకుంటాను. అన్నింటిని బ్యాలెన్స్ చేయడమే మా బలం’’ అని తన కుటుంబం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు ఉపాసన. అంతే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘మేము ఎవ్వరికీ తక్కువ కాదు అని నిరూపించిన సందర్భం అది. రాజమౌళి గారు ఒక అసాధారణమైన వ్యక్తి. ఆయన ఇండియన్స్‌ను ఆ వేదికపై నిలబెట్టిన విధానంతో మాకు గౌరవం దక్కింది. ఇంక మమ్మల్ని ఏది ఆపలేదు. ప్రస్తుతం భారతీయులు.. అంతర్జాతీయ ప్లాట్‌ఫార్మ్‌పై నిలబడ్డారు. జయించడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని గర్వంగా చెప్పారు.


ఎదుగుతూ వచ్చాం..


రామ్ చరణ్‌తో అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రేమలో పడొద్దు, ఎదగాలి అంటుంటాడు రామ్. అలా మేము ప్రతీ ఏడాది ఎదుగుతూ వచ్చాం. తను చాలా మంచి నటుడు. మేము ఒకరిని ఒకరం సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం. జీవితం అనేది పూల పాన్పు కాదు. పువ్వులను చేరాలంటే ముందు ముల్లు కూడా ఉంటాయి. ముందు ముల్లులను ఎలా దాటాలో తెలుసుకోవాలి. దాని తర్వాతే జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ప్రేమలో ఎదగాలి, నేర్చుకుంటూ ఉండాలి. ప్రొఫెషనల్ పరంగా మేము కఠినంగా బౌండ్రీస్ పెట్టుకున్నాం. కానీ పర్సనల్‌గా సాయం కావాలంటే మాత్రం ఒకరికి ఒకరం సాయంగా నిలబడతాం’’ అంటూ ప్రతీ జంట ఒకరినొకరు ఎలా గౌరవించాలో నేర్చుకోవాలని సలహా ఇచ్చారు ఉపాసన కొణిదెల.


Also Read: ఆ విషయంలో రానా సాయం చేశాడు, నేను అంత అర్హురాలిని కాదు - ఉపాసన కొణిదెల