Sangeeth Shobhan's Gamblers Movie Release Date: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అటు యూత్ ఆడియన్స్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో సంగీత్ శోభన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గ్యాంబ్లర్స్'. ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మిస్టరీ ఎంటర్‌టైనర్

ఈ మూవీ మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా.. డిఫరెంట్ రోల్‌లో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆయన సరసన ప్రశాంతి చారులింగ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే 'కేసీఆర్‌' మూవీ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌, పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్‌, మల్హోత్ర శివ, శివారెడ్డి కీలక పాత్రలు పోషించారు.

ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సైన్స్‌  ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌‌మెంట్‌ బ్యానర్‌పై మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ సందర్బంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ.. 'ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో కొత్త సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్‌ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంటుంది.' అని అన్నారు.

Also Read: 'నాయకుడు' కంటే 'థగ్ లైఫ్' భారీ హిట్ అవుతుంది... ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు కమల్ హాసన్ ప్రామిస్

గత చిత్రాలకు భిన్నంగా..

'గ్యాంబ్లర్స్' మూవీ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని నిర్మాతలు అన్నారు. 'మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో సంగీత్‌ శోభన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్‌ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది.' అని తెలిపారు.

ఈ మూవీకి నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం కాగా..  స్క్రీన్ ప్లే - దర్శకత్వం: KSK చైతన్య (KSK Chaitanya), కథ - అదనపు స్క్రీన్‌ప్లే - డైలాగ్స్: విజయ్ చిట్నీడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాష్, సంగీతం: శశాంక్ తిరుపతి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రేమ్ సాగర్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శశాంక్ మాలి, యాక్షన్: వింగ్ చున్ అంజి, కొరియోగ్రఫీ: నిక్సన్ డి'క్రూజ్, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడకాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వంత్ బైరీ, ప్రతిభా రెడ్డి.