విక్టరీ వెంకటేష్, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలు ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. అయితే ఆ సినిమాలను త్రివిక్రమ్ డైరెక్టర్ చేయలేదు. కథ, మాటలు మాత్రమే అందించారు. ఇప్పుడు వెంకీని డైరెక్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ రోల్ రుక్మిణికి ఆఫర్ చేశారట. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్...అల్లు అర్జున్ మూవీ వెనక్కి వెళ్లడంతో!?సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' తర్వాత త్రివిక్రమ్ మరొక సినిమా చేయలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక సోషియో మైథాలజికల్ ఫిల్మ్ ప్లాన్ చేశారు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' తర్వాత బన్నీ - త్రివిక్రమ్ కలయికలో డబుల్ హ్యాట్రిక్ మూవీకి స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. అయితే అట్లీ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. దాంతో త్రివిక్రమ్ మూవీ కాస్త వెనక్కి వెళ్ళింది. 

అల్లు అర్జున్ ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేయడం ఎందుకు? టైం వేస్ట్ ఎందుకు? అని త్రివిక్రమ్ మరొక సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. రచయితగా తనకు అవకాశాలతో పాటు సూపర్ హిట్స్ అందించిన విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో హీరోయిన్ రోల్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కు ఆఫర్ చేశారట. 

రుక్మిణిని త్రివిక్రమ్ ఇటీవల కలిశారని, ఆవిడకు కథతో పాటు తన సినిమాలో హీరోయిన్ రోల్ గురించి వివరించారని టాలీవుడ్ ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం డిస్కషన్లు జరుగుతున్నాయని, రుక్మిణి వసంత్ ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినికిడి.

Also Readవైసీపీ కాదు... 'బాయ్‌కాట్ భైరవం' అంటోన్న మెగా ఫ్యాన్స్‌... సారీ చెప్పిన దర్శకుడు విజయ్ కనకమేడల

ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలో రుక్మిణి!కన్నడ హీరో రక్షిత్ శెట్టికి జోడిగా రుక్మిణి వసంత్ నటించిన సినిమా 'సప్త సగరాలు దాటి'. కన్నడతో పాటు తెలుగులో కూడా ఆ సినిమాకు మంచి స్పందన లభించింది. దాంతో రుక్మిణికి పాపులారిటీ పెరిగింది. 'సప్త సాగరాలు దాటి' విడుదల కావడానికి ముందు తెలుగులో నిఖిల్ సిద్ధార్థ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా చేశారు. అది ఎప్పుడు థియేటర్లోకి వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. అయితే 'సప్త సాగరాలు దాటి' వల్ల ఆవిడకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. 

Rukmini Vasanth upcoming movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'డ్రాగన్' సినిమాలో రుక్మిణి హీరోయిన్. అంతే కాదు... తమిళంలో శివ కార్తికేయన్ సరసన 'మద్రాసి' సినిమాలో కూడా నటిస్తున్నారు. మరో రెండు మూడు భారీ ఆఫర్లు ఆవిడ చేతిలో ఉన్నాయి. తెలుగులో స్టార్ హీరోలతో ఆవిడ పని చేసే అవకాశం ఉంది.

Also Readవిజయ్ సేతుపతి 'ఏస్'లో క్లైమాక్స్ 40 మినిట్స్ తప్ప ఇంకేం బాలేదా? మూవీ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?