Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి కోపంగా చిత్రను తిడుతూ నువ్వే కదా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అని అడుగుతుంది. నిజం చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తానని బెదరిస్తుంది. చిత్ర మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో మనోహరికి చిత్ర మనిషి ఆటోడ్రైవర్ ఫోన్ చేసి బ్లాక్‌మెయిలర్ లాగా మాట్లాడతాడు. మను షాక్ అవుతుంది.
మనోహరి: నువ్వా..?
ఆటోడ్రైవర్: అవును నేనే ఏంటి మను నన్ను పట్టుకోవడానికి నీ మొగుణ్ని.. సారీ త్వరలో మాజీ మొగుడు కాబోతున్నాడు కదా వాడిని వాడి వెనక అమర్‌ను పంపించావు. నన్ను కలవాలంటే అందర్ని ఎందుకు పంపించడం.. నేనే డైరెక్టుగా ఇంటికి వచ్చి అందరినీ కలుస్తానని చెప్పాను కదా..? నువ్వు ఇంతగా కలవాలనుకుంటున్నావు కాబట్టి అమర్ వచ్చాక చెబితే నేనే ఇంటికి వచ్చి అందర్ని ఒకేసారి కలుస్తాను.
మనోహరి: నోనో.. నేను నిజంగా అమర్‌ను పంపించలేదు. రణవీర్ ను పంపించింది కూడా నీకోసం కాదు. ఫ్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయ్..ఆటోడ్రైవర్: చూడు మనోహరి నేను చెప్పినట్టు నువ్వు వింటే.. నువ్వు చెప్పొద్దు అన్న విషయం నేను ఎవ్వరికీ చెప్పను. లేదంటే.. ఇదే ఫోన్ కాల్ అమరేంద్రకు చేస్తాను. డబ్బులు ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. రెడీగా ఉండు
మనోహరి: సరే అలాగే..
చిత్ర: ఏంటి మను నేను నీకేదో హెల్ప్ చేద్దామనుకుంటే నన్నే అనుమానిస్తావా..?
మనోహరి: ఏదో టెన్షన్‌లో ఉండి అలా అన్నాను ఏమీ అనుకోకు.
చిత్ర: అయితే సరే నేను వెళ్లి ప్రెష్ అప్ అయి వస్తాను
మనోహరి: మళ్లీ ఎందుకు రావడం..
చిత్ర: అదేంటి మనం వాటర్ వరల్డ్‌కు వెళ్దాం అనుకున్నాం కదా
మను: నిన్నెవరు పిలిచారు
చిత్ర: వినోద్ పిలిచారు. నేను రాకపోతే తను కూడా వెళ్లనని చెప్పారు. సరే మను లేట్ అవుతుంది వెళ్తాను.
అని చెప్పి చిత్ర వెళ్లిపోతుంది. ఇదేంటి ఇది తేడాగా ఉంది. దీన్ని ఎలాగైనా కట్ చేయాలి అని మను మనసులో అనుకుంటుంది. తర్వాత అందరూ ఎగ్జిబిషన్‌కు వెళ్తారు.
చిత్ర: మను ఏదో చేయబోతుంది అందుకే ఇంత కంగారు పడుతుంది. అది చేస్తున్న తప్పును ఫాలో అయితే అది నేను క్యాష్‌గా మార్చుకోవచ్చు.. అయినా నా పిచ్చి కానీ ఇక్కడ కోట్లు పక్కన పెట్టుకుని లక్షల కోసం కక్కుర్తి పడుతున్నానేంటి..? ( మనసులో అనుకుంటుంది)
మనోహరి పక్కకు వెళ్లి రణవీర్‌కు కాల్ చేస్తుంది.
రణవీర్: చెప్పు మనోహరి
మను: ఏంటి చెప్పేది అంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి వాటర్ పార్క్‌కు రమ్మని చెప్పాను కదా
రణవీర్: ఆల్ రెడీ వచ్చేశాను. మీరు రావడమే ఆలస్యం
మను: అవునా ఎక్కడున్నావు
రణవీర్: నేను కిడ్స్ ప్లేయర్ దగ్గర ఉన్నాను. మీరు ఎక్కడున్నారో చెబితే నా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతాను
మను: సరే మేము లోపలికి వస్తున్నాము.. నువ్వు అమర్ కంట పడకుండా జాగ్రత్త పడు
రణవీర్: సరే మనోహరి..
అంటూ కాల్ కట్ చేస్తాడు. లోపలికి వెళ్లిన అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు అందరూ ఆడుకుంటూ వెళ్లి రణవీర్‌ను చూస్తారు. పిల్లలను చూసిన రణవీర్ షాక్ అవుతాడు.
రణవీర్: ఎలా ఉన్నావు అంజు..
అంజు: బాగానే ఉన్నాం రణవీర్ అంకుల్.. మీరెలా ఉన్నారు..
అమ్ము: అంకుల్ మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి
అమర్: రమ్మని అడిగితే కుదరదు అని చెప్పావు..
రణవీర్: వచ్చిన పని అయిపోయింది అమరేంద్ర గారు.. అందుకే ఒకసారి మీ అందరినీ కలిసి వెళ్దామని వచ్చాను. పైగా అంజలిని కూడా చూసినట్టు ఉంటుంది కదా
అంజలి: సరే అంకుల్ మనం వెళ్లి ఎంజాయ్ చేద్దాం పదండి
అందరూ కలిసి వెళ్లిపోతారు. తర్వాత మనోహరి రణవీర్‌ను పక్కకు తీసుకెళ్లి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపో ఇప్పుడు కిడ్నాప్ చేయడం కుదరదు అని చెప్తుంది. లేదు కిడ్నాప్ చేస్తాను అటు చూడు అంటూ తన మనుషులను చూపిస్తాడు రణవీర్. తర్వాత అంజు ఒక్కతే డస్ట్‌బిన్ దగ్గరకు వెళ్తుంటే రణవీర్ మనుషులతో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!