Brahmamudi Serial Today Episode: ఇంట్లో అందరి డీటెయిల్స్ అయిపోయాయి అని చెప్పగానే యామిని మనిషి వెళ్లిపోతుంటే.. రుద్రాణి ఆపేస్తుంది. ఏంటి కావ్య మీ అత్తకు అంటే తెలియదు నీకైనా తెలియదా నీ గురించి డీటెయిల్స్ ఇవ్వాలని అంటూ ఈవిడ పేరు కావ్య రాసుకోండి ఆఫీసర్ అంటుంది రుద్రాణి.
ఆఫీసర్: ఈవిడ ఈ ఇంటికి ఏమవుతారు..?
రుద్రాణి: ఆ విషయం మా వదిన చెప్తుంది.
ఏం చెప్పాలో అర్థం కాక అపర్ణ చూస్తుంది.
రాజ్: ఏంటి ఆఫీసర్ అంతలా అడుగుతారు. ఆవిడ వారికి మేనకోడలు అవుతుంది. ఏంటమ్మా అంతేగా..?
అపర్ణ: అవును
రుద్రాణి: ఇంత క్లియర్ గా నిజాలు బయట పెట్టినా తెలుసకోలేకపోతున్నావేంట్రా ఇంత తింగరిగా తయారయ్యావు ( మనసులో అనుకుంటుంది.)
ఇందిరాదేవి: కరెక్టుగా చెప్పావు మనవడా.. మేనకోడలే
ఆఫీసర్: మరి మేనకోడలే అయితే వారి అమ్మా నాన్నా ఎక్కడున్నారు.?
ఇందిరాదేవి: వాళ్లు వాళ్ల ఇంట్లో ఉన్నారన్నమాట.. చిన్నప్పటి నుంచి మా అపర్ణ పెంచుకోవడంతో కళావతి ఇక్కడే ఉంటుంది.
ఆఫీసర్: అయితే ఈవిడకు ఓటర్ ఐడీ ఇక్కడ ఉందా..? అక్కడ ఉందా..?
ఇందిరాదేవి: ఈవిడ ఇక్కడ ఉన్నప్పుడు ఓటరు ఐడీ కూడా ఇక్కడే ఉంటుంది కదా..?
ఆఫీసర్: ఓ ఓకే.. సరే
అంటూ వెళ్లిపోతాడు. ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని రూంలోకి తీసుకుకెళ్లి కొడుతుంది. తర్వాత రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కావ్య దగ్గరకు వెళ్లి కాఫీ ఇవ్వమని అడుగుతాడు. కావ్య ఇవ్వనని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అపర్ణ, ఇందిరాదేవి వస్తారు.
ఇందిరాదేవి: ఓరేయ్ మనవడా ఎందుకు వచ్చిన కర్మరా ఇది ఒక కాఫీ కోసం ఇంతలా అడుక్కోవాలా..?
రాజ్: అడుక్కుంటున్నానని మీరంటున్నారు.. రొమాంటిక్‌గా ట్రై చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇదిగో మీ కళావతి పైకి కోపం చూపిస్తుంది కానీ లోపల నా మీద ప్రేమ ఉందని నా నమ్మకం
అపర్ణ: నమ్మకం ఉంటే వెంటనే వెళ్లి ప్రపోజ్ చేయోచ్చు కదా
రాజ్: ప్రపోజా అప్పుడేనా..?
ఇందిరాదేవి: ఒరేయ్ మనవడా నువ్వు కోమాలోకి వెళ్లి గతం మర్చిపోవడం వల్ల నువ్వు నీ వయసు సంగతి మర్చిపోతున్నావు.. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది.
రాజ్: అయినా నాన్నమ్మ తొందర పడితే మొదటికే మోసం వస్తుంది
అపర్ణ: అయితే ఆలస్యం చేస్తే యామినికి సమాధానం చెప్పాల్సి వస్తుంది
రాజ్: అది కూడా నిజమే ఇప్పుడు ఏం చేయమంటారు
ఇందిరాదేవి: వెంటనే వెళ్లి నీ మనసులో ప్రేమను కళావతి ముందు పెట్టు.. తనని పెళ్లికి ఒప్పించు..
రాజ్: ఇప్పుడే కదా కోపం పోగొట్టాను.. అప్పుడే ప్రేమ పెళ్లి అంటే ఎలా రియాక్ట్ అవుతుందో
ఇందిరాదేవి: మరి ఎప్పుడు చెప్తావు
రాజ్: రేపు చెప్తాను శుక్రవారం.. పైగా అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది.
అపర్ణ: అవును అత్తయ్యా వీడు చెప్పేది కూడా నిజమే రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మంచి ముహూర్తం ఉంది
ఇందిరాదేవి: అయితే ఇంకేంటి ఒక ఐదుగురు ముత్తయిదువులను కూడా పిలిపించండి.. లేకపోతే ఏంటి ముందు ప్రపోజ్ చేయరా అంటే ముహూర్తాలు.. గంటలు అంటూ లెక్క పెడతారేంటి..?
రాజ్: ఈరోజు రాత్రికి పుల్లుగా ప్రిపేర్ అవుతాను..రేపు వచ్చి కచ్చితంగా ప్రపోజ్ చేస్తాను
అని రాజ్ వెళ్లిపోతాడు. అంతా విన్న రాహుల్ వెంటనే రుద్రాణి దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. రుద్రాణి, యామినికి ఫోన్ చేసి రేపు రాజ్ ఇటు వైపు రాకుండా చూసుకో అని హెచ్చరిస్తుంది. యామిని సరే అంటుంది. మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి కావ్య దగ్గరకు వెళ్లి రాజ్ వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు కూడా ఒకే చెప్పాలని ఒప్పిస్తారు. ఇష్టం లేకున్నా కావ్య ఓకే అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!