గుండె నిండా గుడి గంటలు మే 23 ఎపిసోడ్  

Continues below advertisement


ప్రభావతి - మనోజ్


కొత్త జాబ్ వెతుక్కుంటున్నా డబ్బులివ్వు అని మనోజ్ అడుగుతాడు. నీలాంటివాడితో రోహిణి ఎలా కాపురం చేస్తోందని మండి పడుతుంది. ఉద్యోగం కన్నా నీ జీవితం ఇంటర్యూలకు వెళ్లడమే సరిపోతుందని ఫైర్ అవుతుంది. బాలు ఇచ్చిన డబ్బులున్నాయి కదా ఇవ్వు , నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి అని మనోజ్ అన్నా కానీ ప్రభావతి ఇవ్వదు. ఆ తర్వాత తండ్రి రూమ్ లోకి వెళ్లిన మనోజ్..తండ్రి వాష్ రూమ్ లో ఉండడం చూసి షర్ట్ జేబులో డబ్బులు దొంగతనం చేసుకుని తీసుకెళ్లిపోతాడు. బాత్ రూమ్ నుంచి వచ్చిన సత్యం డబ్బులు కనిపించకపోవడంతో వచ్చి ప్రభావతిని అడుగుతాడు. సరిగ్గా వెతకండి అంటాడు..ప్రభావతికి అనుమానం వస్తుంది.మనోజ్ వైపు అనుమానంగా చూస్తుంది. మనోజ్ మాత్రం సైలెంట్ గా వెళ్లి వాటర్ తాగుతుంటాడు.మనోజ్ ని డబ్బులు అడుగుతాడు సత్యం..నా దగ్గర లేవని వెళ్లిపోతాడు. అప్పుడే బాలు రావడంతో డబ్బులు అడుగుతాడుసత్యం. ఇద్దాం అని బాలు చూస్తాడు కానీ ఇందాకే డీజిల్ కొట్టించాను లేవు అనడంతో మీనా వచ్చి బాలు చేతికి ఇచ్చి సత్యానికి ఇప్పిస్తుంది.  


ఉద్యోగం సంపాదించేందుకు ఇంటర్యూకి వెళతాడు మనోజ్. తనతో పాటూ ఇంటర్యూకి వచ్చిన వాళ్లని భయపెట్టి, తనకు చాలా డిగ్రీలు ఉన్నాయని చెప్పి పంపించేస్తాడు


బాలు మీనా మనసులో మాటలు


మీనా తనకు ఇష్టమైన టిఫిన్ చేసింది తినాలా వద్దా అని ఆలోచిస్తాడు బాలు. ఏం అనుకుంటే అనుకోనీలే అని తినేస్తాడు. మీరు హాయిగా తినివెళ్తే నాకు చాలు అనుకుంటుంది మీనా. పూరీలు ఇక రెండే ఉండడంతో మీనా తిందో లోదో అని ఆలోచించి వదిలేసి వెళ్లిపోతాడు. అవి తనకోసమే ఉంచాడని సంతోషిస్తుంది మీనా.  


మనోజ్ కి జాబ్ వచ్చేసింది


మనోజ్ క్వాలిఫికేషన్స్‌కి వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది. మీరు కెనడా వెళ్లాలి..అందుకోసం ముందుగా కొంత డబ్బు కట్టాలి అంటాడు. పర్స్ లోంచి 300 తీసి చేతిలో పెడతాడు మనోజ్. 14 లక్షలు కట్టాలని కంపెనీవాడు చెప్పడంతో షాక్ అవుతాడు. ఆ డబ్బు మీరు 4 నెలల్లోనే సంపాదిస్తారని చెబుతాడు. సింగిల్ సిట్టింగ్ లో అయిపోవాలని ఆప్షన్ పెడతాడు 


మీనాని వంటచేయమని హడావుడి చేస్తుంది ప్రభావతి. మనోజ్ ఇంటర్యూకి వెళ్లాడు భజనానికి వస్తాడని చెబుతుంది. అదేంటి ఉన్న ఉద్యోగం నుంచి వాడిని గెంటేశారా అని సెటైర్స్ వేస్తాడు బాలు. ఆ మాటలు విని రోహిణి ఫైర్ అవుతుంది. పెద్ద కంపెనీలో ఆఫర్ వస్తే వెళ్లాడని కవర్ చేస్తుంది. ఇంతలో మనోజ్ వచ్చి తనకు జాబ్ వచ్చిందని చెబుతాడు. సంతోషించిన ప్రభావతి మరి ఏడుపు ముఖం పెట్టావేంటి అంటుంది. 14 లక్షలు విషయం ప్రభావతి చెవిలో చెప్పడంతో షాక్ అవుతుంది 


గుండెనిండా గుడిగంటలు మే 26 ఎపిసోడ్ లో... బాలు ఆటో నడపడం చూస్తుంది మీనా... కారు అమ్మేసినందుకు ప్రభావతి బాలుని నిలదీస్తుంది..రోహిణి ఇదే అదనుగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది


పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!


శని జయంతి రోజు ఈ వస్తువుల దానం మీకు అభివృద్ధిని అందిస్తుంది - అవేంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.