Shani Jayanti 2025 Donation May 27 2025: కర్మల దేవుడిగా కొలిచే శని జన్మదినోత్సవమే శని జయంతి. ఏటా వైశాఖ అమావాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. సూర్యభగవానుడు చాయ కుమారుడు శని. ఈ ఏడాది శని జయంతి మే 27 మంగళవారం వచ్చింది.
2025 శని జయంతి తిథి? (Shani Jayanti 2025 Tithi)
అమావాస్య తిథి మే 26, 2025 సోమవారం ఉదయం 11 గంటల 20 నిముషాలకు ప్రారంభమైందిఅమావాస్య తిథి మే 27, 2025 మంగళవారం ఉదయం 8 గంటల 55 నిముషాల వరకు ఉందిసాధారణంగా అమావాస్య తిథిని రాత్రివేళకు ఉండడం ప్రధానంగా భావిస్తారు..కానీ జయంతి వేడుకలు నిర్వహించుకునేటప్పుడు మాత్రం సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకుంటారు. అంటే శని జయంతి ఈ ఏడాది మే 27 మంగళవారం వచ్చింది.
శని జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక వస్తువులు దానం చేస్తే మీ జీవితంలో వృద్ధి ఉంటుందని పండితులు చెబుతారు. ఈ రోజు ఏ వస్తువులు దానం చేస్తే శని ఆగ్రహం తగ్గి అనుగ్రహం పొందుతారో ఇక్కడ తెలుసుకోండి.. 2025 శని జయంతి దానం (Shani Jayanti 2025)
నల్ల నువ్వులు
శని జయంతి రోజు నల్ల నువ్వులు దానం తప్పకుండా చేయండి.ఈ దానం చాలా శుభప్రదం. నల్ల నువ్వులను మీరు శనిదేవునికి నూనె సమర్పించేటప్పుడు కూడా వేయొచ్చు. ఆవనూనె
శని జయంతి రోజు శనిదేవునికి ఆవనూనె సమర్పించడం చాలా మంచిది. ఈ రోజు శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి, అందులో నల్ల నువ్వులు కూడా వేయండి.
నల్లని వస్త్ర దానం
శని జయంతి రోజు నల్ల బట్టలను దానం చేయండి. నల్ల దుస్తులు లేకుంటే ఏదైనా రంగు దుస్తులను అయినా దానం చేయొచ్చు. వస్త్రదానం చేయడం ముఖ్యం నల్ల చెప్పుల దానం
శని జయంతి రోజు అవసరమైన వారికి చెప్పులు దానం చేయండి. శని జయంతి వేసవి కాలంలో వస్తుంది. అందుకే ఈ చెప్పులు, నీటి కుండ, మజ్జిగ దానం చేయడం కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ శుభాన్నిస్తుంది
ఇనుము దానం
ఇనుము వస్తువు ఎవరి నుంచి ఊరికే తీసుకోకూడదు అంటారు..ఇనుము శనికి సంకేతం. అందుకే శని జయంతి రోజు ఇనుము వస్తువు దానం చేయడం శుభప్రదం. ఈ రోజు పిన్నులు, పాత్రలు లేదా ఏదైనా ఇనుప వస్తువులను దానం చేయవచ్చు. దీనివల్ల శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించనది మాత్రమే. ఇది ప్రాధమిక సమాచారం.. దీనిని అనుసరించే ముందు మీరు విశ్వశించే పండితులను అడిగి అనుసరించండి.
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!