ఇటలీ కార్ల తయారీ సంస్థ Ferrari తమ లేటెస్ట్ మోడల్‌ సిలిండ్రీని ఇండియాలో దించుతోంది. ఫెరారీ తయారీలో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న ఫెరారీ సిలిండ్రీ మొదటి లుక్ బయటకు వచ్చింది.  Ferrari Cilindri First Look Revealed.

పవర్‌ఫుల్ ఇంజిన్

సిలిండ్రీ సూపర్‌కార్ అత్యంత శక్తివంతమైన ఫెరారీ12 ఇంజన్‌తో రూపొందించారు.6.5L ఇంజిన్  కారుకు వెనుకభాగంలో ఉంటుంది. ఇది సొంతంగా శక్తిని సమకూర్చుకుంటుంది. దీనికి ఎలాంటి టర్బో కానీ ఎలక్ట్రిక్ అనుసంధానం కానీ లేదు. కాబట్టి ఇది హైబ్రిడ్ మోడల్ కాదు.820 BHP ఫుల్ పవర్‌తో ఇది ఒక బీస్ట్‌ను తలపిస్తుంది. శక్తివంతమైన ఇంజన్‌కు సాలిడ్ లుక్ ను ఇవ్వడంతో 1950, 60 ల నాటి వింటేజ్ లుక్‌లో ఉంటుంది. 

రోడ్డెక్కితే... రయ్‌... రయ్‌.

కొన్ని కోట్లు పోసి ససూపర్ కార్లను కొనేది ఎందుకు..? అపరిమిత వేగంతో దూసుకెళ్లడానికే కదా.. స్టేటస్ సింబల్‌గా మాత్రమే కాదు..మామూలు కార్లలో దొరకని డ్రైవింగ్ ఎక్స్‌పీరయెన్స్ పొందాలనుకుంటారు కస్టమర్లు. ఆ ఫీల్‌ను ఈ కార్ 100శాతం ఇస్తుంది. ఎందుకంటే ఇది రొడ్డెక్కితే..మామూలుగా ఉండదు.  ఈ 830 ఇంజన్‌ పవర్ 678 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9,500 rpm వరకు రీచ్ అవుతుందంటే.. ఇక డ్రైవింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది కదా... ఈ కారు 2.9 సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్‌ను రీచ్‌ అవుతుంది. 7.8 సెకన్లలోనే 200 km/h చేరుకుంటుంది. దాని గరిష్ట వేగం 340 Km/h  పైగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది రోడ్డు మీద దూసుకెళ్లే బుల్లెట్టు..

 

డిజైన్  ఫీచర్లుఫెరారీ 12 సిలిండ్రీ డిజైన్ 1960లలోని 365 GTB/4 డేటోనా Daytona  నుండి స్ఫూర్తి పొందింది. చాలా తక్కువ బరువు కలిగిన మెటీరియల్స్ తో సన్నితమైన ఏరో డిజైన్స్‌తో కారును రూపొందించాు. క్లామ్‌షెల్ బానెట్ వెనుక వైపు ఉంటుంది. సో కారు ఇంజన్ వెనుకవైపు ఉండటం ఓ విశిష్ట లక్షణం. క్యాబిన్ లోపల, ఫెరారీ ఒక డ్యూయల్-కాక్‌పిట్ డిజైన్‌ను తీసుకొచ్చింది. మూడు స్క్రీన్‌లతో కూడిన అధునాతన హ్యూమన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ (HMI) ఉంది: డ్రైవర్ కోసం 15.6-అంగుళాల స్క్రీన్, సెంట్రల్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇలాగే ప్రయాణీకుడి కోసం 8.8-అంగుళాల స్క్రీన్. ఈ కారు ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి ఆధునిక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

మార్కెట్ రేటు

ఫెరారీ 12 సిలిండ్రీ ఆర్డర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, డెలివరీలు 2025 రెండవ సగంలో ప్రారంభమవుతాయి. కూపే వేరియంట్ 8.5 కోట్లు, స్పైడర్ వేరియంట్ 9.15 కోట్లు Ex Showroom ధర ఉండొచ్చు. ఇందులో అనేక రంగులు, కస్టమైజ్డ్ ఇంటీరియర్ ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కాస్ట్ అన్నది అసలు పెద్ద విషయం కాదు.  ఈా కారు చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఉంటోంది. ఎందుకంటే కంబషన్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న లగ్జరీ సూపర్ కార్ ఇది. భవిష్యత్‌లో ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వైపు మళ్లుతోంది. ఫెరారీ కూడా తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేస్తోంది. కాబట్టి ప్యూర్ డీజిల్ ఇంజన్ తో ఇదే ఆఖరి సూపర్ కార్ కావొచ్చు. కనీసం ఫెరారీ విషయంలో ఇది లాస్ట్ కావచ్చు.