రీతూ వర్మ ఓటీటీలో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ 'దేవికా అండ్ డానీ'. ఇందులో సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులు. జియో హాట్ స్టార్ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది. ఇవాళ ట్రైలర్ విడుదల చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
జూన్ 6వ తేదీ నుంచి దేవికా అండ్ డానీ!శర్వానంద్ కథానాయకుడిగా శ్రీకారం చిత్రానికి దర్శకత్వం వహించిన బి కిషోర్ గుర్తు ఉన్నారా? ఆయన ఈ 'దేవికా అండ్ డానీ' వెబ్ సిరీస్ దర్శకుడు. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలతో న్యూ ఏజ్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా సిరీస్ రూపొందించారు. జూన్ 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు అవుతుందని తెలిపారు.
దేవిక పెళ్లి... మూడు నెలల తర్వాత మరో వ్యక్తి?'త్వరలో దేవిక వివాహం ఉంది కనుక దుష్టశక్తి నుంచి ఎటువంటి కీడు జరగకుండా మహా సుదర్శన హోమం జరిపిస్తున్నారు నాన్నగారు' అని శివన్నారాయణ చెప్పే మాటతో ట్రైలర్ ప్రారంభమైంది. దేవిక పాత్రలో రీతు వర్మ నటించారు. ఆవిడకు సుబ్బరాజుతో పెళ్లి జరుగుతుంది. అయితే ఆమె వెంట పడుతున్న సూర్య వశిష్ట ఎవరు? పెళ్లయిన తర్వాత మూడు నెలలు మరో మగాడిపై ఆప్యాయతగా ఉండడానికి కారణం ఏమిటి? శివ కందుకూరి ఎవరు? నిన్ను మెప్పించొ విసిగించో ఎలాగైనా ఒప్పిస్తాను దేవిక అని సూర్య విశిష్ట ఎందుకు చెప్పాడు? అందరి మాట వినే నాకు నా మాట వినేవాడు ఉండటం చాలా బాగుంది అని దేవిక ఎందుకు చెప్పింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
దేవికను చంపడానికి చూసిన వ్యక్తులు ఎవరు? ఆవిడ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? అనే అంశాలు ఆసక్తి రేపాయి. కోవై సరళ, సోనియా సింగ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, 'వైవా' హర్ష, షణ్ముఖ్, మౌనిక రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు