విక్టరీ వెంకటేష్ (Venkatesh), ఆయన సోదరుని కుమారుడు - మ్యాచ్ స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu Season 2). ఇది హిందీలో రూపొందినప్పటికీ... పలు భారతీయ భాషలలో డబ్బింగ్ చేశారు. తెలుగులో ఆ సిరీస్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. వెంకటేష్ నుంచి ఆ తరహా సిరీస్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓటీటీ ప్రాజెక్ట్స్ అంటే ఆ మాత్రం ఉండడం కామన్. తెలుగులో కొద్దిపాటి విమర్శలు పక్కన పెడితే బాలీవుడ్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రెండో సీజన్ తీశారు. ఇప్పుడు ఆ సీజన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.
జూన్ 13న రానా నాయుడు 2 ప్రీమియర్!Rana Naidu 2 streaming platform release date: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఇప్పుడు రెండో సీజన్‌ను మరింత భారీగా రూపొందించారు. తొలి సీజన్‌లో వెంకటేష్, రానాలతో పాటు అర్జున్ రాంపాల్, సుర్విన్ చావ్లా కీలక పాత్రలు పోషించగా... ఈ సారి కృతి కర్బంద కూడా యాడ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు మరోసారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
జూన్ 13వ తేదీ నుంచి 'రానా నాయుడు 2' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. ఈ సారి కూడా తెలుగు ఆడియన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి సీజన్‌లో వెంకటేష్ వర్సెస్ రానా మధ్య సీన్స్ ఆసక్తి కలిగించాయి. మరి ఈసారి కథ, కథనాలు ఎలా ఉంటాయో చూడాలి. కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను లోకోమోటివ్ గ్లోబల్ సంస్థతో కలిసి సుందర్ ఆరోన్ నిర్మించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు