టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ గత ఏడాది విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో యాక్షన్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ. 915 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.


థియేటర్స్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ఇప్పుడు ఓటీటీ లోనూ అంతకుమించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాని చూసిన బాలీవుడ్ సెలబ్రిటీస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ అతనిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా చేరింది. ఇటీవల కంగనా 'యానిమల్' మూవీపై కంగనా నెగిటివ్ కామెంట్స్ చేసింది. అందుకు సందీప్ వంగా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అంతేకాదు కంగనా ఒప్పుకుంటే ఆమెకు స్టోరీ కూడా చెబుతానని అన్నాడు.






కంగనా ఒప్పుకుంటే ఆమెకి స్టోరీ చెబుతాను


తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనాతో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? అని సందీప్ వంగాని అడిగితే.. "నాకు అవకాశం వస్తే ఆమె ఆ పాత్రకు సరిపోతుందని నాకు అనిపిస్తే.. నేను వెళ్లి ఆమెకు కథ చెబుతాను. నిజం చెప్పాలంటే జెన్యూన్‌గా ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. కంగనా నటించిన క్వీన్ చూశాను. ఆమె యాక్ట్ చేసిన చాలా సినిమాలు చూశాను. ఆమె యాక్టింగ్ బాగుంటుంది. యానిమల్‌పై ఆమె చేసిన నెగెటివ్ కామెంట్స్‌ గురించి నేను అంతగా పట్టించుకోను. నాకు బాధగా కూడా అనిపించదు" అని చెప్పుకొచ్చాడు 


సందీప్ వంగాకి కంగనా రిప్లై


"రివ్యూలు, విమర్శలు ఒకటి కాదు. అవి ఒకేలా ఉండవు. ప్రతి కళపై సమీక్ష, చర్చ అనేది జరుగుతుంది. ఇది ఒక సాధారణ విషయం. నా రివ్యూపై సందీప్ గారు నవ్వుతూ గౌరవాన్ని చూపించిన విధానం చాలా గొప్పది. అది అతను మ్యాన్లీగా సినిమాలు తీయడమే కాదు.. అతని యాటిట్యూడ్ కూడా మ్యాన్లీగానే ఉంటుందని చూపిస్తోంది. థ్యాంక్యూ సార్" అని తాజాగా ట్వీట్ చేసింది.


"కానీ, దయచేసి నాకు ఎలాంటి పాత్రను ఇవ్వకండి. లేకపోతే మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారు. ఆపై మీ సినిమాలు కూడా విజయం సాధించవు. మీరు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తారు. మీలాంటి వాళ్లు సినిమా పరిశ్రమకు కావాలి. కానీ, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల్లోని స్త్రీద్వేషపూరిత సన్నివేశాలు, డైలాగ్స్ ఆహ్వానించతగినవి కావు" అంటూ తనదైన స్టైల్ లో సందీప్ ని ఓవైపు పొగుడుతూనే మరోవైపు సెటైర్లు వేసింది. దీంతో సందీప్ రెడ్డి వంగా పై  కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Also Read : డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం: 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు