గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు బయోపిక్ చేయలేదు. ఒకవేళ చేస్తే అవకాశం వస్తే... తాను చాలా రోజుల నుంచి స్పోర్ట్స్ పర్సన్ రోల్ చేయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య నేషనల్ మీడియాతో చెప్పారు. క్రికెట్ సెన్సేషన్ విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే బావుంటుందని సలహా ఇవ్వగా... తప్పకుండా చేస్తానని చరణ్ అన్నారు. మరి, ఆయన ఫ్యామిలీ మెంబర్ బయోపిక్ చేస్తారా? ఉపాసన తాతయ్య పాత్రలో వెండితెరపై కనిపిస్తారా? ఈ ప్రశ్నకు రామ్ చరణ్ సతీమణి ఏం చెప్పారో తెలుసా?


వెండితెరపై 'ప్రతాప్ రెడ్డి'గా రామ్ చరణ్?
రామ్ చరణ్ సతీమణి, ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల తాతయ్య ప్రతాప్ సి రెడ్డి గురించి ప్రజలకు తెలుసు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ఆయన. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత కూడా! ఫిబ్రవరి 5న ఆయన బర్త్ డే. 


తాతయ్య పుట్టినరోజు సందర్భంగా 'ది అపోలో స్టోరీ' పేరుతో ఉపాసన ఓ పుస్తకం పాఠకుల ముందుకు తీసుకు వచ్చారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతాప్ సి రెడ్డి కుమార్తెలు, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కొందరు హాజరు అయ్యారు. ఆ పుస్తకావిష్కరణలో ఉపాసనకు ఓ ప్రశ్న ఎదురైంది. 'మీ తాతయ్య జీవితంపై బయోపిక్ తీసే ఆలోచన ఉందా? ఆ సినిమా వస్తుందా?' అని అడిగితే... ''భవిష్యత్తులో బయోపిక్ రావచ్చు'' అని ఉపాసన చెప్పారు. మరి, 'ప్రతాప్ సి రెడ్డి పాత్రలో రామ్ చరణ్ నటిస్తారా?' అని అడిగితే... 'దర్శకుడి విజన్ మీద ఆధారపడి ఉంటుంది' అని ఉపాసన చెప్పుకొచ్చారు.


Also Readనాకు నేను విపరీతంగా నచ్చా - 'ఈగల్'పై మాస్ మహారాజా కాన్ఫిడెన్స్ చూస్తుంటే...


అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపనలో ప్రతాప్ సి రెడ్డికి ఎదురైన సవాళ్లు, సరికొత్త ఆవిష్కరణలు, విజయాలు... అన్నీ 'ది అపోలో స్టోరీ' పుస్తకంలో ఉంటాయని ఉపాసన తెలిపారు. అమర చిత్ర కథ సౌజన్యంతో ఈ పుస్తకం తీసుకొచ్చారు.


Also Readరజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ కాస్ట్లీ గురూ - నిమిషానికి కోటిన్నర!?






ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి వచ్చిందని సమాచారం. బహుశా... ఈ ఏడాది దసరాకు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు. బుచ్చిబాబు సానా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయ్యింది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే... మర్చి 27కు లుక్ విడుదల చేసే ఆలోచన ఉందట.