Family Star Nanda Nandana Song: విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్యామిలీ స్టార్‌'. 'గీత గోవిందం' లాంటి క్లాసిక్‌ మూవీతో అందరినీ మెస్మరైజ్‌ చేసిన పరశురామ్‌ ఈ సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్క అప్‌డేట్‌ను అందిస్తోంది మూవీ టీమ్‌. ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌. ఇక ఇప్పుడు ఆ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. మొదటి సాంగ్‌కి సంబంధించి ప్రోమో మెస్మరైజ్‌ చేస్తోంది. 


మెలోడియస్‌ బీజీఎమ్‌తో.. 


'ఫ్యామిలీస్టార్‌'కి సంబంధించి మొదటి సాంగ్‌ ప్రోమోను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. 'నంద నందన' అనే అంటూ సాగే ఈ పాటకు సంబంధించి గ్లింప్స్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మెలోడియస్‌ బీజీఎమ్‌ మెస్మరైజ్‌ చేస్తోంది. ఇక మొత్తం పాటని ఈ నెల 7న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకి గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక ఈ నంద నందన పాటను అనంత్‌ శ్రీరామ్‌ స్వరపరచగా.. సిద్‌ శ్రీరామ్‌ పాడారు. దీంతో ఈ పాటపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి ఫ్యాన్స్‌కి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాట ప్రోమో షేర్‌ చేసిన దేవరకొండ.. ' మొదటిపాట.. నా ఫెవరేట్‌.. మీకు కూడా 7న కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది' అని పోస్ట్‌ చేశాడు. 






మృణాల్‌ లుక్స్‌కి ఫిదా.. 


ఈ ప్రోమోలో మృణాల్‌ ఠాకూర్‌ ఎంట్రీ చూసి కుర్రకారు, ఆమె అభిమానులు ఫిదా అయిపోతారనే చెప్పాలి. ఏప్రిల్‌ నెలలో 'ఫ్యామిలీ స్టార్‌' రిలీజ్‌ ఉంటుందనే వార్తలు బాగా వినిపించాయి. అయితే, దానికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఏప్రిల్‌ 5న సినిమా రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. ఇదే విషయం విజయదేవరకొండ కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. నిజానికి ఆ డేట్‌కి ఎన్టీఆర్‌ 'దేవర' రిలీజ్‌ కావాల్సి ఉండగా.. దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. మ్యూజిక్‌ లేట్‌ అవ్వడం వల్ల రిలీజ్‌ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆ డేట్‌నే విజయదేవరకొండ తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నారు.'ఖుషీ' సినిమాతో మంచి హిట్‌ అందుకున్న విజయదేవరకొండ ఇక ఇప్పుడు 'ఫ్యామిలీస్టార్‌'తో కూడా ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక వరుసగా రెండు సినిమాలు తీసి, హిట్‌ అందుకున్న మృణాల్‌ ఠాకూర్‌.. తెలుగులో హ్యాట్రిక్‌ కొట్టాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌.  


'గీతగోవిందం'మళ్లీ రిపీట్‌.. 


విజయదేవరకొండ తీసిన సినిమాల్లో 'గీత గోవిందం' మంచి హిట్‌ టాక్‌ అందుకున్న సినిమా. తన కెరీర్‌లో మొదటి వందకోట్ల సినిమా. ఇక ఇప్పుడు కూడా అదే కాంబినేషన్‌ రిపీట్‌ అవ్వడంతో ఈ సినిమా కూడా 'గీత గోవిందం' అంత పెద్ద హిట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజైన ఈ ప్రోమో చూస్తూ కూడా అలాంటి అద్భుతమైన సినిమానే రాబోతోంది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. ఇక ఇదే విషయాన్ని కామెంట్లలో కూడా పోస్ట్‌ చేస్తున్నారు.    


Also Read: ఆమె సినిమాలను తొక్కేయాలని చూస్తుంది - ‘12th ఫెయిల్’ డైరెక్టర్ భార్యపై కంగనా ఫైర్