Kangana Ranaut: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌.. ఎవ్వరికీ భయపడదు. తను ఏం అనుకుంటుందో అని ధైర్యంగా, నిస్సందేహంగా చెప్పేస్తుంది. అలా ఇప్పటికే ఎంతోమంది మీద కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌ చేశారు ఆమె. అలా ఎన్నో కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిక ఈ మధ్యే రిలీజై సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న '12th ఫెయిల్‌' సినిమా డైరెక్టర్‌ విధు వినోద్ చోప్రా భార్య అనుమప చోప్రాపై కామెంట్స్‌ చేశారు ఆమె. 


అనుపమ చోప్రాపై ఫైర్‌.. 


విధూ వినోద్ చోప్రా భార్య, ఫిలిమ్‌ క్రిటిక్‌ అనుపమ చోప్రాపై కంగనా రనౌత్‌ ఫైర్‌ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఆమెపై సెటైర్లు వేశారు కంగనా. '12th ఫెయిల్‌' సినిమా తీసేటప్పుడు చాలామంది నిరాశపరిచారని, పెట్టిన పెట్టుబడిలో పావల కూడా రాదని అన్నారని విధూ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. డైరెక్ట్‌ ఓటీటీలో రిలీజ్‌ చేయమని చెప్పిన వాళ్లలో తన భార్య కూడా ఉన్నారని ఆయన అన్నారు. దీనిపై స్పందించారు కంగనా. "అనుపమ చోప్రా ఫిల్మ్‌ జర్నలిజంకి పనికిరాదు. ఆమెకి టాలెంట్‌ ఉన్న అమ్మాయిలంటే జెలసీ. డైరెక్టర్‌ భార్యగా చలామణీ అవుతూ.. తన వెబ్‌సైట్‌ని నడుపుకుంటోంది. గాసిప్స్‌ బ్యాచ్‌లో చేరి మంచి సినిమాలను తొక్కేయాలని చూస్తుంది. భర్త పేరు వాడుకుని ఈవెంట్లు, ప్రోగ్రామ్‌లకు అటెండ్‌ అవుతుంది" అంటూ ట్వీట్‌ చేశారు కంగనా రనౌత్‌. 






కంగనాకు కలిసిరాని 2023


ఇక కంగనా రనౌత్‌ చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "మీరు ఏదైనా ధైర్యంగా మాట్లాడతారు" అని కొందరు అంటుంటే.. "ముందు మీ కెరీర్‌ చూసుకోండి" హిట్లే లేవు అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి కంగనా రనౌత్‌కి 2023 కలిసిరాలేదనే చెప్పాలి. ఆమె ఆ ఏడాడి పెద్దగా హిట్లు పడలేదు. ఇక ఇప్పుడు కూడా ఆమె చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేవు. కేవలం 'ఎమర్జెన్సీ' మాత్రమే రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అది కూడా జూన్ 14న రీలీజ్‌ చేయనున్నారు. ఎమర్జెన్సీ' సినిమాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. షార్ట్ హెయిర్ కట్, మెడలో రుద్రాక్ష మాల, చీర, అచ్చం ఇందిరా గాంధీలా మేకోవర్‌ అయ్యారు కంగనా రనౌత్‌. ఇక ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తోంది.   


సూపర్‌ హిట్‌గా 12th Fail


‘12th ఫెయిల్‌’ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయిన వ్యక్తి సివిల్స్‌ ఎలా సాధించాడు అనేది చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎంతోమంచి టాక్‌ వచ్చింది.


Also Read: ఈవారం థియేటర్‌, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే