This week OTT Releases: మూవీ లవర్స్‌ని అలరించేందుకు ఓటీటీల్లో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కి పండగే. 'గుంటూరు కారం' సినిమా ఓటీటీలో రీలీజ్‌ కానుంది. ఇక అంతేకాదు థియేటర్లలో కూడా కొత్త సినిమాలు అలరించబోతున్నాయి. మరి ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమ్‌ అవుతున్నాయి? ఏ సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి ఒకసారి చూసేద్దాం. 


థియేటర్‌లో సినిమాలు ఇవే.. 


రవితేజ, అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ నటించిన సినిమా 'ఈగల్‌'. యాక్షన్‌ థ్రలర్‌గా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. సంక్రాంతికి రావాల్సిన సినిమాను మేకర్స్‌ వాయిదా వేశారు. 


రజనీ గెస్ట్‌ పాత్రలో.. 


తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేస్తున్న 'లాల్‌సలామ్‌' సినిమా కూడా ఈ నెల 9న రిలీజ్‌ కాబోతోంది. మరోవైపు మణికందన్‌, శ్రీ గౌరిప్రియ, కన్న రవి నటించిన తమిళ సినిమా 'ట్రూ లవర్‌' ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే యువతను ఆకట్టుకుంటోంది. 


పవన్‌ సినిమా రీరిలీజ్‌.. 


పవన్‌కల్యాణ్‌ సినిమా రీ రిలీజ్‌ కాబోతోంది. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో 2012లో వచ్చిన సినిమా'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'.. ఈ సినిమా ఫిబ్రవరి 7న కొన్ని సెలక్టడ్‌ థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు.  


ఓటీటీలోకి మహేశ్‌, ధనుష్‌.. 


సంక్రాంతి బరిలో నిలిచి.. మిశ్రమ స్పందన అందుకున్న మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌‌ల 'గుంటూరు కారం' ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 9వ తేదీన ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక ధనుష్‌ నటించిన 'కెప్టెన్‌ మిల్లర్‌' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. కన్నడ బ్లాక్‌బస్టర్‌ 'కాటేర' 'జీ'లో ఈ నెల 9న స్ట్రీమింగ్‌ కానుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని హాలీవుడ్‌ సిరీస్‌లో, సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానున్నాయి. భూమి ఫడ్నేకర్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'భక్షక్‌', సుస్మితాసేన్‌ నటించిన ఆర్య -3 వెబ్‌సిరీస్‌ ఆసక్తిని పెంచుతున్నాయి. ఆర్య, ఆర్య-2 సిరీస్‌ ఇప్పటికే ఓటీటీలో హిట్‌టాక్‌ తెచ్చుకున్న సిరీస్‌. యాంకర్‌ సుమా కొడుకు రోషన్‌ నటించిన మొదటి సినిమా 'బబుల్‌గమ్‌' కూడా ఈ వారంలో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.   


నెట్‌ఫ్లిక్స్‌.. 


⦿ వన్‌ డే (హాలీవుడ్‌), ఫిబ్రవరి 8
⦿ భక్షక్‌ (హిందీ వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 9
⦿ గుంటూరు కారం (తెలుగు) ఫిబ్రవరి 9


డిస్నీ + హాట్‌స్టార్‌ 


⦿ ఆర్య - 3 (హిందీసిరీస్‌) ఫిబ్రవరి 9


బుక్‌ మై షో.. 


⦿ ఆక్వామెన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 5


ఆహా.. 


⦿ బబుల్‌గమ్‌ (తెలుగు) ఫిబ్రవరి 9


జియో సినిమా


⦿ ఎ ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 6
⦿ ద నన్‌ -2 (హాలీవుడ్‌) ఫిబ్రవరి 7
⦿ హలో (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 8


సన్‌నెక్ట్స్‌


⦿ అయలాన్‌ (తమిళ్‌) ఫిబ్రవరి 9 


పవన్‌ సినిమా రీరిలీజ్‌..


పవన్‌కల్యాణ్‌ సినిమా రీ రిలీజ్‌ కాబోతోంది. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో 2012లో వచ్చిన సినిమా'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'.. ఈ సినిమా ఫిబ్రవరి 7న కొన్ని సెలెక్టడ్‌ థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఇదే సినిమా 8,9 తేదీల్లో కూడా కొన్ని థియేటర్లలో స్పెషల్‌ షోలు వేస్తున్నారు. ఇక ఇప్పటికే బుకింగ్స్‌ స్టార్ట్‌ అవ్వగా.. అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి.


Also Read: క్లీంకార కేర్‌ టేకర్‌ ఎవరో తెలుసా? - ఆమె నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే