Guntur Kaaram OTT Release Date: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా... కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులను క్రియేట్ చేసింది. త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కలెక్షన్స్ విషయంలో బ్లాక్‌బస్టర్ అందుకున్న ‘గుంటూరు కారం’ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇక ఈ మూవీ థియేటర్లలో విడుదలయ్యి నెల రోజుల అవ్వకముందే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. తాజాగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.


రౌడీ రమణ వచ్చేస్తున్నాడు..


ఫిబ్రవరి 9 నుండి ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ‘ఇక్కడ వాతావరణం వేడిగా మారబోతుంది ఎందుకంటే రౌడీ రమణ వచ్చేస్తున్నాడు. అతడు చాలా ఆవేశంలో ఉన్నాడు’ అంటూ క్యాప్షన్‌తో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. ఫిబ్రవరి 9 నుండి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘గుంటూరు కారం’ స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దాంతో పాటు ఒక కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.






ఎక్స్‌ట్రా సీన్స్‌తో పాటు..


థియేటర్లలో ‘గుంటూరు కారం’ 159 నిమిషాల రన్ టైమ్‌తో విడుదలయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం సినిమా డ్యూరేషన్ పెరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘గుంటూరు కారం’ థియేట్రికల్ వర్షన్‌లో అమ్మ పాటను డిలీట్ చేశారు. దాంతో పాటు బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించి కొన్ని యాక్షన్‌ సీన్లు కూడా డిలీట్ అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ‘గుంటూరు కారం’ ఓటీటీ వర్షన్‌లో చూడవచ్చని సమాచారం. దీంతో సినిమా నిడివి కూడా పెరగనుంది. తాజాగా అమ్మ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు మేకర్స్. కథ మొత్తానికి చాలా కీలకంగా నిలిచిన ఇలాంటి పాటను కట్ చేయడం ఏంటి అంటూ ప్రేక్షకులు విమర్శలు కురిపించారు. దీంతో ఈ పాటతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ను కూడా ఓటీటీ వర్షన్‌లో యాడ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.



18 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా..


‘గుంటూరు కారం’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజు విడుదలయిన ‘హనుమాన్’తో పోలిస్తే ఈ సినిమాకు కాస్త నెగిటివ్ రివ్యూలే లభించాయి. అయినా కూడా ‘గుంటూరు కారం’ విడుదలయిన 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.122 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో వన్ మ్యాన్ షోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మహేశ్ బాబు. మహేశ్, శ్రీలీల కలిసి వేసిన స్టెప్పులను థియేటర్లలో ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఎంతోకాలంగా మహేశ్ బాబు ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం చూడలేదంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు కూడా.


Also Read: 'గుడ్‌నైట్‌' ఫేం మణికందన్‌ హీరోగా 'లవర్‌' మూవీ - తెలుగులో 'ట్రూ లవర్‌', రిలీజ్‌ ఎప్పుడంటే..