True Lover Movie Release Date: గతేడాది ఓటీటీ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్‌లో రిలీజైన తమిళ డబ్బింగ్ చిత్రం 'గుడ్‌నైట్' మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో కోలీవుడ్ నటుడు మణికందన్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. అదే హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'లవర్'. తెలుగులో ట్రూ 'లవర్' పేరుతో రిలీజ్ అవుతుంది. 'గుడ్‌నైట్'మేకర్స్, సేమ్ బ్యానర్లో మణికందన్ హీరోగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇటీవల రిలీజైన టీజర్ మరింత అంచనాలు పెంచింది. అయితే ఈ మూవీ ఏడాది క్రితమే ప్లాన్ చేయగా ఇప్పుడు లవ్ అండ్ రొమాంటిక్ మూవీ థియేటర్లోకి రాబోతోంది. తమిళంలో లవర్ పేరుతో ఫిబ్రవరి 9న, ట్రూ లవర్ పేరుతో తెలుగులో ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతోంది. మాస్ మూవీ మేకర్స్, మారుతి టీం ప్రోడక్షన్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మణికందన్ జోడిగా గౌరిప్రియ హీరోయిన్‌గా నటిస్తుంది. రైటర్ పద్మభూషణం, మెయిల్, మ్యాడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ లవర్ సినిమాతో కోలివుడ్‌కి పరిచయం కాబోతోంది.
బేబీ తరహాలోనే 'లవర్' కూడానా?
ఇటీవల రిలీజైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ బేబీ తరహాలో యూత్‌ని బాగా ఆకట్టుకునేలా ఉందంటున్నారు. హీరోయిన్ కాలేజీలో హీరోని చూసి ప్రేమలో పడటం, తరువాత అతనికి దగ్గర కావడం. ఈ ప్రయాణంలో మరొకడితో పరిచయం కావడం. హీరోయిన్ ని ప్రేమించిన హీరోకి వాడితో స్నేహం చేయొద్దని వార్నింగ్ ఇవ్వడం, ఇద్దరి మధ్యలో గొడవలు పెరిగి ద్వేషించుకునేంత వరకు వెళ్ళడం టీజర్ లో చూపించారు. యూత్ టార్గెట్ చేస్తూ కామన్ గా టీనేజ్ ప్రేమకథల్లో కనిపించే ఎమోషన్స్ అన్నింటిని చూపించి డైరెక్టర్ హైప్ పెంచాడు. బేబీ చూపించిన అన్ని లవ్ అండ్ ఎమోషన్స్ ఎలిమెంట్స్ అని లవర్‌లోనూ కనిపించాయి. కాబట్టి బేబీ తరహా ఈ మూవీ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. నిర్మాతగా ఎస్‌కేఎన్ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు.