Ram Gopal Varma Comments on Poonam Pandey: నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ పూనమ్ పాండే ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. శుక్రవారం ఆమె మ్రతి చెందిందంటూ ఆమె టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ప్రకటన ఆమె ఆఫీషియల్ అకౌంట్ నుంచి రావడంతో అంతా నిజమని నమ్మేశారు. దీంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్స్‌లు, కామెంట్స్ వెల్లువెత్తాయి. సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని చెప్పడంతో అంతా ఆ క్యాన్సర్ గురించే చర్చించుకున్నారు. ఈ క్రమంలో ఆమె మ్రతిపై అన, ఆరా తీశారు. అయితే కొందరు ఆమె మరణవార్తను కొట్టిపారేశారు. పూనమ్ మరణం నిజం కాదని వాదన వినిపించగా మారికొందరు నిజమే అనుకుని నటికి నివాళులు అర్పించారు.
ఈ క్రమంలో శనివారం బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసి అందరికి షాకిచ్చింది పూనమ్ పాండే. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్ చేసి తాను ఇలా చేయడానికి కారణం ఉందని, సర్వైకల్ క్యాన్సర్‌పై అందరికి అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశానంది. అయితే ఆమె తీరుపై అంతా మండిపుడుతుంటే.. మరికొందరు మాత్రం మద్దతు తెలుపుతున్నారు. తాను ఏ పద్దతి ఎంచుకుంటే ఏంటీ.. ఓ మంచి పనికోసమే చేసింది కదా అని పూనమ్‌ను సమర్థిస్తున్నారు. తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పూనమ్‌కు మద్దతు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పూనమ్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఏం సాధించావని ఎవరూ ప్రశ్నించరు..
“హే పూనమ్@iPoonampandey.. అందరి దృష్టిని ఈ ఇష్యూపైకి తిప్పేందుకు నువ్వు పాటించిన పద్ధతి వల్ల తీవ్ర స్థాయిలో విమర్శలు రావొచ్చు. కానీ, ఈ రూమర్ పుట్టించడం వల్ల నువ్వు సాధించింది.. దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఇప్పుడు దేశమంతా సర్వైకర్ క్యాన్సర్ గురించే చర్చించుకుంటుంది. ఇప్పుడంతా అదే ట్రెండ్ అవుతుంది. దీనిపై అవగాహన కల్పించడానికి నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నేను ప్రశంసి్తున్నాను. నీలాగే నీ మనసు కూడా చాలా అందమైంది. నువ్వు ఇంకా చాలా కాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అని వర్మ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు తమదైన స్టైల్లో సటైర్లు వేస్తున్నారు.
అందుకే ఇలా చేశా
తాను చనిపోయానంటూ పూనమ్ పాండే కావాలనే టీంతో ఫేక్ న్యూస్ ఇచ్చిందని స్పష్టమైంది. అయితే, తాను బతికే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ చర్చించుకునేందుకే తాను ఇలా చేశానంటూ నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో పోస్ట్ చేశారు పూనమ్. “నేను జీవించే ఉన్నా. సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. కానీ, ఈ వ్యాధి వల్ల చనిపోయిన వేలాది మంది మహిళల విషయంలో నేను ఇలా చెప్పలేను. దీని గురించి ఎలాంటి అవగాహన లేని కారణంగా.. వారు ఏం చేయలేకపోయారు. మిగితా క్యాన్సర్‌లాగే.. సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా నయం చేసుకోవచ్చు. దానిపై అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను చనిపోయినంటూ తప్పుడు సమాచారం ఇచ్చాను. ఈ వ్యాధిని గుర్తించాలంటే మీరు చేయాల్సిందల్లా టెస్టులు చేయించుకోవడం, హెచ్‍వీపీ వ్యాక్సిన్ వేయించుకోవాలి” అని పూనమ్ తన వీడియోలో చెప్పుకొచ్చింది.
Also Read: