Ambajipeta Marriage Band Collections: క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టిన నటుడు సుహాస్‌ హీరోగాను మంచి గుర్తింపు పొందాడు. 'కలర్‌ ఫొటో', 'రైటర్‌ పద్మభూషణ్‌' వంటి చిత్రాలతో మంచి విజయం సాధించాడు. మరోవైపు నెగిటివ్‌ రోల్స్‌లోనూ మెప్పిస్తున్నాడు. ఇటీలవ హిట్‌: ది సెకండ్‌ కేసులో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు. మరోవైపు హీరోలకు స్నేహితుడిగాను అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్‌ హీరోగా నటించిన సినిమా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'.దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రల్లో నటించారు.


జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహార్ మ బ్యానహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్లో సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది. ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్‌ చేశారు. దాంతో ఈ మూవీ విడుదలైన ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ప్రీమియర్ల షోలతో క్రిటిక్స్‌ నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. దాంతో ఈ మూవీ తొలి రోజు భారీ ఒపెనింగ్‌ ఇచ్చింది.  ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ చూసి మేకర్సే సర్‌ప్రైజ్‌ అవుతున్నారట. 


ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 2.28 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఒక చిన్న హీరో సినిమా ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడమంటే సాధారణ విషయం కాదు. రెండవ రోజు కూడా ఈ మూవీ అదే జోరుతో కొనసాగుతుందంటున్నారు. ఇక సినిమాకు పాజిటిట్‌ బజ్‌ రావడం, వీకెండ్‌ కావడంతో మూవీ వసూళ్లకు ప్లస్‌ అయ్యేలా ఉందంటున్నారు. వీకెండ్‌ కల్లా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమా సర్‌ప్రైజింగ్‌ కలెక్షన్స్‌ చేసే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్‌ వర్గాలు. పైగా ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాల సందడి, ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో సినిమా కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.






మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎలా ఉందంటే


అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌ సినిమాకు ప్రమోషన్స్‌తో కలిసి రూ.20 కోట్ల బడ్జెట్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ట్రీజర్లు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ బిజినెస్‌ ఊహించిన దానికంటే భారీగా జరిగిందట. భారీగా బిజినెస్ వ్యాల్యూ కట్టారు.ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాను పలు చోట్ల గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతంగా రిలీజ్ చేయగా.. ఓవర్సీస్‌లో, మరి కొన్ని ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్ దక్కాయట. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ వాల్యూ సుమారుగా 15 కోట్ల షేర్‌, 30 కోట్ల గ్రాస్ వసూళ్లుగా జరిగినట్టు ట్రేడ్‌ నిపుణుల నుంచి సమాచారం.