Shekar Kammula-Rana Leader 2: దగ్గుబాటి వారసుడు రానా హీరోగా పరిచయమైన మూవీ 'లీడర్'. 15 ఏళ్ల క్రితం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఫస్ట్ మూవీతోనే రానాకు పర్పామెన్స్ పరంగా వందకు వంద మార్కులు పడ్డాయి. స్టార్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న రానా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకుని సాహసం చేశాడనే చెప్పాలి. చాక్లెట్ బాయ్ లుక్ ఉన్న రానా పొలిటికల్ డ్రామా చేయడమేంటని మూవీ రిలీజ్‌కు ముందు అంతా సందేహించారు. కానీ రిలీజ్ అనంతరం తన యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు రానా. తొలి సినిమాతోనే స్టార్ హీరో జాబితాలో చేరిపోయాడు.
అంతగా రానాకు గుర్తింపు తెచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో సీక్వెల్ ట్రెండ్ అంతగా లేకపోవడం ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు మేకర్స్. కానీ సినీ ప్రియులు మాత్రం ఇప్పటికీ లీడర్ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అప్పటి సమకాలీన రాజకీయ వ్యవస్థలను చూపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందులో యంగ్ సీఎంగా రానా లుక్, పర్ఫామెన్స్ తెలుగు ప్రజలను, యూత్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో దీనికి పార్ట్ 2 కూడా వస్తే బాగుండని దగ్గుబాటి ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశపడ్డారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యాన్స్‌ను ఖుషి చేసే ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కుర్లు కొడుతుంది. లీడర్ 2 త్వరలోనే రాబోతుందంటున్నారు.
Also Read: బాలీవుడ్ సీనియర్ హీరోను లైన్‌లో పెట్టిన సందీప్ - డార్క్ యాక్షన్ క్రైమ్ థిల్లర్ కథతో సినిమా
ఈ తాజా బజ్ ప్రకారం లీడర్ సీక్వెల్‌పై మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఎందుకంటే రీసెంట్‌గా శేఖర్ కమ్ముల ఎషియన్ మూవీస్‌లో మరో సినిమా ప్రకటించారు. కానీ హీరో, జానర్, కాస్ట్ ఎవరన్నది క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇది 'లీడర్ 2' అయ్యింటుందనే గుసగుసలు మొదలయ్యాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత లీడర్ 2పై చర్చలు జరుగుతున్నాయని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్ నడుస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్ ఉండనుందట. ఆంధ్రప్రదేశ్ విభజన, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ స్టార్ ధనుష్ మూవీతో బిజీగా ఉన్నాడు. ధనుష్-నాగార్జునతో మల్టీస్టారర్ తీస్తున్నాడు శేఖర్ కమ్ముల.
దీని తర్వాత లీడర్ 2పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి, నేటి రాజకీయల నేపథ్యంలో మంచి స్క్రిప్ట్ రెడీ చేయమని మేకర్స్ శేఖర్ కమ్ములతో చెప్పినట్టు తెలుస్తోంది. ధనుష్-నాగార్జున మూవీ తర్వాత 'లీడర్2' స్క్రిప్ట్‌పై ఈ క్లాసిక్ డైరెక్టర్ పని చేయనున్నాడట. అయితే ఈసినిమా రానాతో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా పరిశీలిస్తున్నారట శేఖర్ కమ్ముల. వారు గెస్ట్ రోల్లో కనిపించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న లీడర్ 2పై త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు సనీ వర్గాలు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.