Sandeeep Reddy Vanga: కొందరు డైరెక్టర్లకు ఎక్కువ సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా.. వారికి ఛాన్స్ ఇవ్వడానికి సీనియర్ హీరోలు ముందుకొస్తారు. దానికి వారి టాలెంటే కారణం. అలాగే సందీప్ రెడ్డి వంగా కూడా దర్శకుడిగా తన కెరీర్‌లో చేసినవి మూడు సినిమాలే అయినా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో ఈ దర్శకుడితో కలిసి సినిమా చేయాలని ఎంతోమంది స్టార్ హీరోలు ఆశపడుతున్నారు. ఇక తెలుగులో ఒకటి, హిందీలో రెండు చిత్రాలను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ తర్వాత తన అప్‌కమింగ్ మూవీని కూడా బాలీవుడ్‌లోనే ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. అందులో నటించడానికి ఒక బాలీవుడ్ సీనియర్ హీరో సిద్ధంగా ఉన్నాడట.


చిరంజీవితో చేయాలనుంది..


యాక్షన్, వయోలెన్స్‌ను సందీప్ రెడ్డి వంగా చూపించినట్టుగా ఇంకా ఏ ఇతర డైరెక్టర్ చూపించలేడేమో అంటూ బాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. తనకు తెలుగులో చిరంజీవి, హిందీలో షారుఖ్ ఖాన్‌లాంటి సీనియర్ హీరోలతో నటించాలని ఉందని ఇప్పటికే తన కోరికను బయటపెట్టాడు. అయితే తాజాగా వీరిద్దరూ కాకుండా మరో సీనియర్ హీరోతో సందీప్ సినిమా ఫైనల్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ ఫరెవర్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. సందీప్ రెడ్డి వంగా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ఒక డార్క్ యాక్షన్ క్రైమ్ థిల్లర్ రాబోతుందని బాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


స్టార్ హీరోల కోరిక..


‘అర్జున్ రెడ్డి’ అనే సినిమాతో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా విడుదలయిన ‘యానిమల్’ అయితే సందీప్ స్థాయిని వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. సినీ సెలబ్రిటీలు సైతం సందీప్ టేకింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోలు సైతం తనతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. ఇంతలోనే సల్మాన్ ఖాన్‌తో సందీప్ సినిమా ఉంటుందని రూమర్స్ వైరల్ అవుతుండడంతో తను పూర్తిగా బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయే ఆలోచనలో ఉన్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.


లైన్‌లో ‘స్పిరిట్’..


‘యానిమల్’తో ఎన్నో కాంట్రవర్సీలకు కూడా కారణమయ్యాడు సందీప్ రెడ్డి వంగా. చాలామంది విమర్శకులు.. ఈ సినిమాలోని పలు అంశాలపై విమర్శలు కురిపించారు. ఆ విమర్శలను లెక్కచేయని సందీప్.. ‘యానిమల్ 2’కు కథను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు. అంతే కాకుండా ప్రస్తుతం సందీప్ చేతిలో ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’ కూడా ఉంది. ప్రభాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా ‘స్పిరిట్’ తెరకెక్కనుంది. కానీ ఇప్పటికే ఈ పాన్ ఇండియా హీరో చేతిలో ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజా సాబ్’లాంటి సినిమాలో ఉన్నాయి. అంటే ఈ రెండు చిత్రాలు అయిపోయే వరకు సందీప్ కచ్చితంగా ఎదురుచూడాల్సిందే. అలా అని ‘యానిమల్ పార్క్’ ప్రారంభించాలన్ని రణబీర్ కపూర్ డేట్స్ ఖాళీగా లేవు. దీంతో ఇదే గ్యాప్‌లో సందీప్.. సల్మాన్‌తో సినిమా పూర్తి చేస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: షాకింగ్‌.. ఆ హీరోకు తల్లిగా అనసూయ? ఏ సినిమాలో అంటే!