Syed Sohel Bootcut Balaraju: బిగ్ బాస్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసిన ఆయన, చక్కటి నటనతో అలరించాడు. ఆయన నటించిన సినిమాల్లోని కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కోనేటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల అయ్యింది.
తన సినిమా చూడాలంటూ సోహెల్ ఎమోషనల్
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘బూట్ కట్ బాలరాజు‘ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది. అనుకున్న స్థాయిలో థియేటర్లు లభించాయి. కానీ, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు కూడా పెద్దగా రావడం లేదు. హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల్లో ప్రేక్షకుల తాకిడి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. మంచి సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరించడం లేదని కంటతడి పెట్టాడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాలని వేడుకున్నాడు.
“ఈ సినిమా ఫ్రెండ్స్ తో మాత్రమే కాదు, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ మూవీలో ఎలాంటి వర్గారిటీ ఉండదు. క్యూట్ గా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమలో అందరూ చూడండి. హైదరాబాద్ లో మంచి రెస్పాన్స్ ఉంది. కానీ, కొన్ని ఏరియాల్లో సినిమా చూసేందుకు థియేటర్లకు ఎవరూ రావడం లేదు. ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ కావడం బాధ కలిగిస్తోంది. కంటెంట్ ఉన్న ప్రోత్సహిత్సాం అంటారు. ఇది కంటెంట్ ఉన్న సినిమా. వచ్చి చూడండి. మా సినిమా కష్టపడి చేశాం. డబ్బులు లేక పబ్లిసిటీ చేసుకోలేదు. సినిమా విషయంలో కొంత మంది రివ్యూ ఇవ్వడం చూసి బాధపడ్డాను. కనీసం, 20 నిమిషాలు సినిమా చూడకముందే రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇదేం పద్దతి? బిగ్ బాస్ ఉన్నప్పుడు సోహెల్ ను ఎలా ప్రోత్సహించారో? ఈ సినిమా విషయంలోనూ అలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను” అన్నాడు.
సోహెల్ ను ఓదార్చిన ముక్కు అవినాష్!
తన సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో బాధపడుతున్న సోహెల్ ను ముక్కు అవినాష్ ఓదార్చాడు. “మంచి ఫ్యామిలీ సినిమా చేసినా, ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వచ్చిన స్పందన, సినిమా విషయంలో ఎందుకు రావడం లేదో అర్థం కావట్లేదు” అన్నారు. ముక్కు అవినాష్ తో కలిసి థియేటర్ కు వెళ్లిన సోహెల్ తన సినిమాకు స్పందన లేకపోవడంపై కంటతడి పెట్టారు. ప్రేక్షకులకు ఫ్యామిలీ సినిమాలు అంటే పెద్దగా నచ్చడం లేదన్నారు. కిస్ సీన్లు, వర్గలర్ కంటెంట్ ఉంటేనే ఆదరిస్తారని అర్థం అయ్యిందన్నారు. “తెలంగాణ, రాయలసీమలో నా సినిమాను చూడండి అన్నా. థియేటర్లకు వెళ్లండి అన్నా. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు సోహెల్, సోహెల్ అని వేల కామెంట్లు పెట్టారు కదా. నెక్ట్స్ ఫ్యామిలీ సినిమాలు చేయాలి అనుకోవడం లేదు. ముద్దు సీన్లు చేసి ఎంకరేజ్ చేస్తా” అంటూ ఏడ్చేశాడు. ఈ సినిమాకు తప్పకుండా మంచి స్పందన లభిస్తుందంటూ ముక్కు అవినాష్ సోహెల్ ను ఓదార్చాడు.
‘బూట్ కట్ బాలరాజు‘ సినిమాలో సోహైల్ సరసన మేఘ లేఖ హీరోయిన్ గా నటించింది. ఎండీ పాషా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజ, సునీల్, సిరి హన్మంతు, జబర్దస్త్ రోహిణి, ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Read Also: పూనమ్ పాండే మరణవార్తపై స్పందించని కుటుంబం - మృతదేహం ఏమైంది?