Poonam Pandey Death: బాలీవుడ్ మోడల్, నటి అయిన పూనమ్ పాండే మరణ వార్త ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. 32 ఏళ్ల వయసులో సెర్వికల్ క్యాన్సర్‌తో పూనమ్ మరణించిందని ముందుగా తన మ్యానేజర్ ప్రకటించారు. ఆ తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు పూనమ్ పాండే టీమ్. కానీ ఈ విషయంలో నిజమెంత అని ఎవరూ ఆలోచించకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చూసి ఒక్కసారిగా ఆర్‌ఐపీ అంటూ స్టేటస్‌లు పెట్టారు నెటిజన్లు. ఇప్పటికీ ఈ విషయంపై పూనమ్ పాండే కుటుంబం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తను నిజంగానే చనిపోతే తన మృతదేహం ఎక్కడా అని సందేహాలు మొదలయ్యాయి.
ఏ ఆధారాలు లేవు..
ముందుగా పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో తన టీమ్ షేర్ చేసిన మరణవార్తను పూర్తిగా నమ్మారు నెటిజన్లు. కానీ ఎక్కడి నుండో మరొక వార్త వైరల్ అయ్యింది. అసలు పూనమ్ చనిపోలేదని, ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. దీంతో ఏది నిజం? ఏది అబద్ధం? అని తెలియక ప్రేక్షకులు కూడా అయోమయంలో పడ్డారు. అబద్ధమని చెప్పడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఎందుకంటే తను మరణించిందని టీమ్ చేసిన పోస్ట్ తప్పా ఇంకా ఏ ఆధారం లేదు. చివరికి పూనమ్ పాండే కుటుంబం కూడా ఈ మరణ వార్తపై స్పందించలేదు. ఈ విషయం ఇప్పుడు ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యేలా చేసింది.
త్వరలోనే అధికారిక ప్రకటన..
పూనమ్ పాండే మరణ వార్త నిజం కాదు అని సందేహాలు వ్యక్తమవుతుండగా.. పీఆర్ టీమ్ స్పందించింది. ‘‘మాకు పూనమ్ పాండే అక్క నుండి ఫోన్ వచ్చిందని తన మరణం గురించి స్పష్టం చేస్తున్నాం. కుటుంబం నుండి మరింత సమాచారం అందగానే అందరికీ అప్డేట్ చేస్తాం. వెంటనే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తాం’’ అని తెలిపింది. పూనమ్ పాండే సన్నిహితులు కూడా తనకు క్యాన్సర్ ఉందనే విషయం తమకు తెలియదంటూ షాక్ అయ్యారు. అంతే కాకుండా మరణించిందని వార్త వచ్చే మూడు రోజుల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది పూనమ్. అందులో చాలా ఆరోగ్యంగా కనిపించింది.
మృతదేహం ఎక్కడ.?
ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మరణ వార్త బయటికి వచ్చినప్పటి నుండి పూనమ్ పాండే ఫ్యామిలీ కనిపించడం లేదట. కేవలం పూనమ్ అక్క మాత్రమే తన మరణ వార్త గురించి బయటపెట్టింది. ఆ తర్వాత కుటుంబం నుండి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో మరోసారి తన అక్కను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తన ఫోన్ రీచ్ అవ్వడం లేదని సమాచారం. అంతే కాకుండా ఒకవేళ పూనమ్ పాండే మరణిస్తే.. తన మృతదేహం ఎక్కడ ఉంది? అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? లాంటి అనుమానాలు కూడా ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. దీంతో పాటు ప్రస్తుతం పూనమ్ పాండే నివాసముంటున్న ఇంటి దగ్గర కూడా విచారణ జరపగా.. అక్కడ ఎవరికీ ఈ విషయం గురించి తెలియదని తెలుస్తోంది.