కోలీవుడ్ నుంచి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' సినిమాతో తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నార్త్ ఇండియన్ బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar). ఇప్పుడు ఆ అమ్మాయి న్యాచరల్ స్టార్ నాని (Nani)తో నటించే అవకాశం సొంతం చేస్తుందని సమాచారం. ఇంతకీ వాళ్ళిద్దరూ నటించబోయే సినిమా ఏదో తెలుసా? 

నాని 'ప్యారడైజ్'లో కయాదు లోహర్!నాని హీరోగా గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో రా అండ్ రస్టిక్ సినిమా 'దసరా' తీసి భారీ విజయం అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ తర్వాత మరోసారి నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి సినిమా (Nani Odela 2) చేయనున్న సంగతి తెలిసిందే.

నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న తాజా చిత్రానికి 'ప్యారడైజ్' (Nani Paradise Movie) టైటిల్ ఖరారు చేశారు. అందులో కయాదు లోహర్ హీరోయిన్ అని ఫిలింనగర్ వర్గాల టాక్. అది సంగతి.

Also Read: రామ్ ఎవరి అభిమాని? ఆయన ఆంధ్ర కింగ్ ఎవరు? Ram Pothineni బర్త్‌ డేకి టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ రిలీజ్

కయాదుతో పాటు 'ప్యారడైజ్' సినిమాలో మరో కథానాయిక కూడా చోటు ఉంటుందని తెలిసింది. ఆమె ఎవరనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన సినిమా టీజర్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Readమహేష్ బాబు, సూర్య, రామ్ చరణ్, ఎన్టీఆర్... టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాల్లో నటించినోడు... Ullu Show అడల్ట్ షో 'హోస్ అరెస్ట్' వివాదం... ఇప్పుడు రేప్ కేస్... ఎవరీ అజాజ్ ఖాన్?

హిట్ 3 సక్సెస్ జోష్... నాని మాస్!నాని కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హిట్ 3' బాక్స్ ఆఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. వసూళ్లతో పాటు నాని నటన కొత్తగా ఉందని, ఆయన వేరియేషన్ చూపించారని విమర్శకులతో పాటు ప్రేక్షకుల సైతం ప్రశంసించారు. ఈ సక్సెస్ అందించిన జోష్‌తో కొత్త సినిమా చిత్రీకరణ మరింత ఉత్సాహంగా ప్రారంభించడానికి నాని రెడీ అవుతున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన విజువల్స్ చూస్తే ఆయన లుక్ కొత్తగా ఉండబోతుందని అర్థం అవుతుంది. సినిమా మరింత కొత్తగా ఉంటుందట.