అజాజ్ ఖాన్ (Ajaz Khan)... ఆల్మోస్ట్ వారం నుంచి వార్తల్లో వినబడుతున్న పేరు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. డర్టీ వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి 'ఉల్లు' కోసం రూపొందించిన అడల్ట్ షో 'హౌస్ అరెస్ట్' (Ullu House Arrest)పై విమర్శలు వస్తున్నాయి. అవకాశాలు ఇస్తానని నమ్మించి తన మీద పలుమార్లు అత్యాచారం చేశాడని అతడి మీద ఫిర్యాదు చేసిందో నటి. అసలు ఎవరీ అజాజ్ ఖాన్? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? అనేది తెలుసుకోండి. 

అసలు ఎవరీ అజాజ్ ఖాన్?ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు?Ajaz Khan Background: ఇండస్ట్రీలో అజాజ్ ఖాన్‌కు ఎటువంటి నేపథ్యం లేదు. ఆయనది అహ్మదాబాద్. నటన మీద ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. 'పాత్' (Patth) సినిమాతో నటుడిగా 2003లో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఏక్తా కపూర్ నిర్మించిన 'క్యా హోగా నిమ్మో కా'తో టీవీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 'బాలీవుడ్ క్లబ్' షో విజేతగా నిలిచాడు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 7' (2013) షోలో సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అతడికి పెళ్లైంది. ఒక పిల్లాడు ఉన్నాడు.

హిందీలో అవకాశాలు తగ్గాయో? లేదంటే తెలుగు నుంచి పిలుపు రావడం లేదో? అడల్ట్ కంటెంట్ మీద పడ్డాడు. ఉల్లు యాప్ కోసం రూపొందిన 'హౌస్ అరెస్ట్' హోస్ట్ చేశాడు. ఆ షో చూసిన జనాలు 'ఛీ... తూ' అని ఉమ్మేస్తున్నారు. దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. హిందీలో టీవీ సీరియల్స్, షోస్ చేసే అతడికి తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఛోటా మోటా క్యారెక్టర్లు, ఛాన్సులు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోలతో, తెలుగులో సినిమాలు చేశాడని తెలుసా?

రామ్ గోపాల్ వర్మ సినిమాతో ఎంట్రీతెలుగులో అజాజ్ ఖాన్ నటించిన తొలి సినిమా 'రక్త చరిత్ర 2'. రామ్ గోపాల్ వర్మ సినిమాతో అతడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పరిటాల రవి జీవిత నేపథ్యంలో తీసిన ఆ సినిమాలో మద్దెల చెరువు సూరికి జైలులో పరిచయమై... జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సాయం చేసే పాత్రలో కనిపించాడు అజాజ్ ఖాన్.

'దూకుడు'లో నాయక్ తమ్ముడు బంటీ'రక్త చరిత్ర' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'దూకుడు'లో అజాజ్ ఖాన్ నటించాడు. ఆ సినిమాలో మహేష్ బాబు అండ్ టీం ఇస్తాంబుల్ వెళ్లి ఒకరిని చంపేస్తారు. ఆ సీన్ గుర్తుందా? అందులో మహేష్ షూట్ చేసేది అజాజ్ ఖాన్‌నే. 'దూకుడు'లో మెయిన్ విలన్ నాయక్ (సోనూ సూద్) తమ్ముడు బంటీ రోల్ చేశాడు అజాజ్ ఖాన్.

Also Read: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్‌? ఈ రెండు సినిమాల్లో ఏముంది?

'నాయక్'లో టాక్సీ సేఠ్ కూడా అజాజేగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్' సినిమాలోనూ అజాజ్ ఖాన్ నటించాడు. టాక్సీ సేఠ్ రోల్ చేశాడు. రామ్ చరణ్ చేతిలో తన్నులు తినే పాత్ర చేశాడు. 'బ్రూస్ లీ' సినిమాలో టెర్రరిస్ట్ రోల్ కూడా చేశాడు అజాజ్ ఖాన్. ఓ హోటల్ మీద ఎటాక్ చేయగా... తర్వాత అతడిని షాయాజీ షిండే షూట్ చేసి చంపేస్తాడు.

ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాలోనూ అజాజ్!'దూకుడు' తర్వాత 'బ్రూస్ లీ', 'బాద్ షా' సినిమాల్లోనూ అజాజ్ ఖాన్ (Ajaz Khan Telugu Movies)కు శ్రీను వైట్ల అవకాశాలు ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ మాసెసె ఎన్టీఆర్ 'బాద్ షా' సినిమాలోనూ అతడితో చిన్న రోల్ చేయించారు. 'టెంపర్'లోనూ కనిపించాడు. 

Also Readప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు

ఇంకా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్', 'రోగ్', 'బుడ్డా హోగా తేరా బాప్', 'టెంపర్' సినిమాల్లో అజాజ్ ఖాన్ నటించాడు. తెలుగులో అతడు చేసిన రోల్స్ చిన్నవే. పైగా, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ విలన్ రోల్స్. మెయిన్ విలన్ కాకుండా విలన్ సైడ్ కిక్ రోల్స్ చేశాడు. ఇప్పుడు సినిమాలతో కాకుండా అడల్ట్ కంటెంట్ షోస్ ద్వారా వివాదాల్లో నిలిచాడు.