'హిట్ 3' విజయం సాధించాలని కోలీవుడ్ స్టార్ సూర్య ఆకాంక్షించారు. మరో వైపు 'రెట్రో' హిట్ అవ్వాలని న్యాచురల్ స్టార్ నాని కోరుకున్నారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాటు సోషల్ మీడియాలోనూ ఒకరికొకరు బెస్ట్ విషెస్ చెప్పుకోవడం చూసే ఉంటారు. విషెష్ మాత్రమే కాదు... స్టోరీలు కూడా షేర్ చేసున్నారా? అనే రెండు సినిమాలు చూసినోళ్లకు సందేహం కలుగుతోంది. ఒక్కటే కథను ChatGptలో వేస్తే రెండు వెర్షన్స్ (హిట్ 3, రెట్రో) వచ్చాయా? అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఎందుకు రెండు కథల మధ్య కంపేరిజన్స్ వస్తున్నాయి? రెండిటిలో కామన్ పాయింట్స్ ఏం ఉన్నాయి? అని చూస్తే... 

సూర్య... నాని... ఆ నవ్వు ఏది?'నువ్వు నవ్వితే బావుంటావ్' - 'రెట్రో' సినిమాలో పారి (హీరో సూర్య)తో తల్లి చెప్పే మాట. ఆ మాటను ప్రేయసి రుక్మిణి (పూజా హెగ్డే) కూడా చెబుతుంది. పారి ముఖంలో అసలు ఎప్పుడూ నవ్వు కనిపించదు. 'హిట్ 3'కి వస్తే... అర్జున్ సర్కార్ (నాని) కూడా నవ్వడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక బరువైన భావన మనకు కనిపిస్తుంది. 

'హిట్ 3'లో ఏసీపీ అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటిస్తే... 'రెట్రో'లో పారి అలియాస్ జడాముని పాత్రలో సూర్య లవర్ / గ్యాంగ్‌స్టర్ రోల్ చేశారు. అయితే... ఆ రెండు క్యారెక్టరైజేషన్స్ మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ రెండు పాత్రలూ తల్లి ప్రేమకు దూరంగా పెరిగినవే. సీరియల్ కిల్లింగ్స్ ఆపడం ద్వారా దేశంలో ప్రజల రక్షణ కోసం అర్జున్ సర్కార్ ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తే... బంగారు చేపలను దేశం దాటి వెళ్లకుండా చేయడం ద్వారా పరోక్షంగా సూర్య కూడా దేశ రక్షణకు కృషి చేశారు. అవినీతి మంత్రిని అరెస్ట్ చేయించారు. 

'హిట్ 3'లో క్యాప్చర్... టార్చర్... కిల్...'రెట్రో'లో రబ్బర్ కల్ట్... రెండూ ఒక్కటే!'హిట్ 3', 'రెట్రో' సినిమాల మధ్య మరో సిమిలారిటీ... విలన్స్! 'హిట్ 3'లో ప్రతీక్ బబ్బర్ విలన్ రోల్ చేయగా... 'రెట్రో'లో కింగ్ మైఖేల్ పాత్రలో విధు ప్రతాప్ విలనిజం చూపించారు. ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ ఒక్కటే.

'హిట్ 3'లో అమాయకుల ప్రాణాలు తీసిన కొందరిని డార్క్ వెబ్ ద్వారా తన 'సీటీకే' (క్యాప్చర్... టార్చర్... కిల్) గ్యాంగ్ మెంబర్లుగా చేసుకుంటాడు విలన్. ఏడాదికి ఓసారి అందరిని ఒక్క చోటుకు చేర్చి అమాయకుల ప్రాణాలు తీసే వికృత క్రీడ పెడతాడు. తద్వారా సైకిక్ ఆనందాన్ని పొందుతాడు. 'రెట్రో'లో విలన్ చేసేది కూడా అదే. 'రబ్బర్ కల్ట్' అని క్లబ్ పెట్టి, ఒక దీవిలో అమాయకులకు - వివిధ జైళ్లలో గొడవలు పడిన ఖైదీలను తీసుకొచ్చి రెండు గ్రూపుల మధ్య పోటీ పెడతాడు. ఎవరైతే ఓడిపోతారో, ఆ గ్రూపులో సభ్యుడు ఒకరిని ఎంపిక చేసి రక్తం వచ్చేలా కొట్టి చివరికి మొసలికి ఆహారంగా వాడతాడు. మధ్యలో బాణాలు గట్రా వంటివి ఉంటాయి. విలన్ రోల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అన్నట్టు ఉన్నాయి.

Also Readప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు

'హిట్ 3', 'రెట్రో' సినిమాల్లో టైమ్ పీరియడ్ వేరు. ఒకటి యాక్షన్ నేపథ్యంలో తీసిన క్రైమ్ థ్రిల్లర్ అయితే... మరొకటి గ్యాంగ్‌స్టర్ / మాఫియా నేపథ్యంలో తీసిన ప్రేమ కథ. క్రైమ్ అరికట్టడం కోసం ఒకరు, ప్రేమ కోసం మరొకరు యుద్ధం చేశారు. కానీ, ఆ యుద్ధం చేసే క్రమంలో, కథా గమనంలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. 'రెట్రో' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే... 'హిట్ 3' సూపర్ హిట్ టాక్, భారీ వసూళ్లతో ముందుకు వెళుతోంది.

Also Read: పూజా హెగ్డే కాదు... రుక్మిణి - Retro సినిమాలో BTS ఫోటోలు షేర్ చేసిన బుట్టబొమ్మ