సినిమాలలో నటించడం వేరు, సినిమా నిర్మించడం వేరు! హీరోయిన్ రోల్ చేసినప్పుడు కేవలం నటించడంతో అందాల భామల పని పూర్తి అవుతుంది. తాము నటించినందుకు గాను నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుంటారు. అదే నిర్మాత విషయానికి వస్తే... ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు అందరికీ పేమెంట్లు సెటిల్ చేయడంతో పాటు థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు సమంత ఆ పనుల్లో ఉన్నారు. ఆవిడ నిర్మాతగా పరిచయం అవుతున్న 'శుభం' నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనట!
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి 'శుభం'!?ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత... నిర్మాతగా 'శుభం'తో తన తొలి అడుగు వేస్తున్నారు. ఈ సినిమా మే 9న థియేటర్లలోకి వస్తుంది. అయితే రెండు రోజులు ముందుగా హైదరాబాద్, విశాఖ నగరాలలో స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. విడుదలకు ముందు సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలిసింది.
Also Read: ఆపరేషన్ సింధూర్ పిరికి చర్య... ఇండియన్ ఆర్మీపై పాక్ హీరోయిన్ల పోస్టులు
ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌తో సమంత ప్రొడక్షన్ హౌస్ టీం డిస్కషన్స్ చేస్తోంది. ఆల్మోస్ట్ డీల్ క్లోజ్ అయినట్టే అని ఫిలింనగర్ వర్గాల టాక్. 'శుభం' సినిమా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తీసిన 'సినిమా బండి' సైతం ఆ ఓటీటీలోనే ఉంది.
జీ తెలుగుకు శాటిలైట్ రైట్స్!'శుభం' ఓటీటీ కంటే ముందు శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ అయిందని తెలిసింది. ప్రముఖ తెలుగు టీవీ నెట్వర్క్ 'జీ తెలుగు' సంస్థ శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది. ముందు ఓటీటీలో, ఆ తర్వాత టీవీలో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
'ఏం మాయ చేసావే' సినిమాకు పేరున్న హీరోయిన్ తీసుకునే ఛాన్స్ గౌతమ్ మీనన్ దగ్గర ఉన్నప్పటికీ కొత్త హీరోయిన్ అయిన తనకు అవకాశం ఇచ్చారని, అందుకే తాను నిర్మించిన తొలి సినిమాలోనూ అందరూ కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చానని సమంత తెలిపారు.