'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor) మీద యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకుల మీద తీవ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజల మతం తెలుసుకుని మరీ ప్రాణాలు తీశారు. భర్తను చంపేసిన ఉగ్రవాదులతో తననూ చంపేయమని ఓ భార్య అడగ్గా... 'మోడీకి వెళ్లి చెప్పు' అని బదులు ఇచ్చింది ఉగ్రమూక. ఇప్పుడు మోడీ గట్టిగా బదులు ఇచ్చారని కథానాయిక, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పేర్కొన్నారు.
మోడీతో చెప్పమని చెప్పాడుగా...ఇప్పుడు వాళ్ళకు మోడీ చెప్పాడు!జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులు ఇచ్చింది. పాక్ గడ్డ మీద తీవ్రవాద శిబిరాల మీద వైమానిక దాడి చేసింది. ఈ ప్రతీకార ఘటనపై కంగనా రనౌత్ పోస్ట్ చేశారు.
''ఉనోనే కహా థా... మోడీ కో బతా దేనా! ఔర్ మోడీ నే ఉన్ కో బతా దియా'' (వాళ్ళు చెప్పారు కదా... మోడీకి వెళ్లి చెప్పు అని. ఇప్పుడు మోడీ వాళ్ళకి చెప్పారు) అని కంగనా రనౌత్ పోస్ట్ చేశారు. మోడీ చెబితే ఎలా ఉంటుందో అనే గర్వం ఆమె మాటల్లో వ్యక్తం అయ్యింది.
Also Read: పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలపై దాడికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు?
సైనికులను ఈశ్వరుడు రక్షిస్తాడు!''మనల్ని రక్షించేవాడిని ఈశ్వరుడు రక్షిస్తాడు. మన సైనికులు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే, వాళ్ళు ఎప్పుడూ విజయాలు సాధించాలి. ఆపరేషన్ సింధూర్'' అని కంగనా రనౌత్ మరొక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆవిడ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: మాకు దేశమే ముఖ్యం.. అందుకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నాం- ఏబీపీ సమ్మిట్‌లో ప్రధాని
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, సుధీర్ బాబు సహా పలువురు సెలబ్రిటీలు 'ఆపరేషన్ సింధూర్' పట్ల హర్షం వ్యక్తం చేశారు.