Pawan Kalyan Hari Hara Veera Mallu Releasing Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవెయిటెడ్ పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ నెల 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవలే ఆఖరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేయగా.. ఇప్పుడు రిలీజ్ డేట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

డేట్ లీక్ చేసిన 'బుక్ మై షో'

ఈ మూవీ జూన్ 12 రిలీజ్ కానున్నట్లు టికెట్స్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో' (Bookmyshow) తెలిపింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇదే రిలీజ్ డేట్ అంటూ పవన్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మూవీ షూటింగ్ పూర్తి

ప్రజా పాలనలో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. 'హరిహర వీరమల్లు' పార్ట్ 1 షూటింగ్‌లో ఈ నెల 4 నుంచి రెండు రోజుల పాటు పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఎ.ఎం.రత్నం తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తైందని.. ఇక థియేటర్లలో రిలీజ్ కావడమే తరువాయి అంటూ చెప్పారు. బ్లాక్ బస్టర్ సాంగ్స్, అదిరిపోయే ట్రైలర్ త్వరలోనే విడుదలవుతాయన్నారు. ఇప్పటికే రీ రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన లుక్స్, సింగిల్స్ ఆకట్టుకుంటున్నాయి.

Also Read: 'మహా భారతం'లో ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం - డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఆమిర్ ఖాన్ ఏమన్నారంటే?

ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా.. ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ఇటీవలే పూర్తైంది. 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ఫస్ట్ పార్ట్‌ను రిలీజ్ చేయనున్నారు. సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. అనివార్య కారణాలతో ఆయన డైరెక్షన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. దీంతో మిగిలిన భాగాన్ని నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించారు. రెండో పార్ట్ కూడా ఆయనే డైరెక్ట్ చేయనున్నారు.

పవన్ సరసన నిధి అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా మూవీ తెరకెక్కనుండగా పవన్‌ను ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తోన్న తొలి మూవీ కావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.