సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) పాన్ వరల్డ్ సినిమా (SSMB29) చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండస్ట్రీలో ఒక్క రికార్డు క్రియేట్ కావడం ఖాయమని తెలిసింది. అది బాక్స్ ఆఫీస్‌కు సంబంధించినది కాదు... హీరోగా మహేష్ బాబు తన 26 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ మీద చేయని ఒకసారి కొత్త ఫీట్ చేయబోతున్నారని టాక్. అది ఏమిటి? అంటే...
సుకుమార్ చేయలేని పని...ఎస్‌ఎస్ రాజమౌళి చేశాడు మరి!తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రజెంట్ జనరేషన్ హీరోలు అందరూ దాదాపుగా ఏదో ఒక సినిమాలో తమ కండలు తిరిగిన దేహాన్ని చూపించారు. ఫైట్స్ కోసమో లేదంటే సీన్ డిమాండ్ చేసిందనో సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద షర్ట్ విప్పి సందడి చేశారు. అయితే ఇప్పటి వరకు వెండితెర మీద షర్టు లేకుండా ఒక్క సీన్ కూడా చేయని హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు. ఆయన షర్ట్ లెస్ సీన్ చేయలేదు. సిక్స్ ప్యాక్ చూపించలేదు.
'వన్ నేనొక్కడినే'లో మహేష్ బాబును డైరెక్ట్ చేశారు సుకుమార్. ఆ టైంలో సూపర్ స్టార్ చేత సిక్స్ ప్యాక్ చేయించే ప్రయత్నం చేశారు. మహేష్ బాబును షర్టు లేకుండా సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని ట్రై చేశారు. అయితే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసే క్రమంలో ఫేస్ కాస్త చేంజ్ అయినట్టు అనిపించడంలో మహేష్ మానేశారు. ఇప్పుడు ఆయన చేత రాజమౌళి సిక్స్ ప్యాక్ చేయించారని తెలిసింది.
Also Read: నానికి జోడీగా కాయదు లోహర్... ఇద్దరూ నటించబోయే సినిమా ఏదో తెలుసా?
రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో షర్టు లేకుండా మహేష్ బాబు ఒక ఫైట్ చేశారని టాలీవుడ్ టాక్. అందులో సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారట. ఆ ఫైట్ ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారని సమాచారం. దాంతో సుక్కు చేయాలని పనిని రాజమౌళి చేశారని ఇండస్ట్రీలో కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఘట్టమనేని అభిమానులు అయితే తమ హీరోని సిక్స్ ప్యాక్‌తో సిల్వర్ స్క్రీన్ మీద చూడవచ్చని సంతోషంగా ఉన్నారు.
Also Read: రామ్ ఎవరి అభిమాని? ఆయన ఆంధ్ర కింగ్ ఎవరు? Ram Pothineni బర్త్ డేకి టైటిల్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో గ్లోబల్ రికగ్నైజేషన్ ఉన్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్ కనుక నెలపాటు హాలిడేస్ తీసుకోవాలని చిత్రీకరణకు గ్యాప్ ఇవ్వాలని మహేష్ బాబు డిసైడ్ అయ్యారట. జూన్ లేదా ఆ తరువాత ఫారిన్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట.