Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో గిఫ్ట్ మీద ఫ్రమ్ అడ్రస్ లేదు ఎవరు పంపించారో ఏంటో అంటాడు కేదార్.


ధాత్రి: ఓపెన్ చేయొద్దు అని చెప్తుంది.


మధు: మీరేమైనా సీక్రెట్ ఏజెంట్స్ ఆ, మిమ్మల్ని లేపేయటానికి బాంబులు పంపిస్తారా అని జోక్ చేస్తూ కేదార్ని గిఫ్ట్ ఓపెన్ చేయమంటుంది.


సడన్ గా అక్కడికి వచ్చిన మధుని చూసి కంగారు పడతాడు యువరాజ్. ఆమెని అక్కడ నుంచి ఎలాగైనా పంపించాలని మధు నిన్ను అమ్మ పిలుస్తుంది అని దూరం నుంచి కేక వేసినట్లు పిలుస్తాడు. మధు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రిలాక్స్ ఫీల్ అవుతాడు యువరాజ్.


అయితే ఆ గిఫ్ట్ లేయర్లు లేయర్లుగా ఉండి లోపల బాంబు ఉండటం మూలాన ఫస్ట్ లేయర్లో ఏమీ లేకపోవడంతో ఎవరో ఫ్రాంక్ చేస్తున్నారు అనుకోని గిఫ్ట్ పక్కన పెట్టేస్తారు.


ఆ తర్వాత హాల్లో అందరూ డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుంటారు. కపుల్ డాన్స్ లో సురేష్, దివ్యాంక డాన్స్ చేస్తూ ఉంటే కౌషికి బాధపడుతూ ఉంటుంది. అది చూసి భరించలేక పోతుంది ధాత్రి.


వైజయంతి: నేను మొదలు పెట్టిన పనిని నువ్వు పూర్తి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటుంది. మీరేం మొదలుపెట్టారు అని అయోమయంగా అడుగుతుంది నిషిక.


వైజయంతి: సురేష్ కి కౌషికి కి నేనే దూరం పెంచాను అనే సంగతి ఇప్పుడప్పుడే నిషికి చెప్పకూడదు అనుకుంటుంది. బయటికి మాత్రం అదే భర్తను చూసి కౌషికి బాధపడుతుంది కదా దాని గురించి మాట్లాడుతున్నాను అంటుంది.


కౌషికి బాధని చూసి భర్త కి ఫోన్ చేసి కలర్ బెలూన్స్ పైనుంచి వేసేయమని చెప్తుంది. సరే అని బెలూన్స్ కిందికి వేసే లోపు వైజయంతి కేదార్ దగ్గరకు వచ్చి అందరూ కిందనుంటే నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.


కేదార్: ఏమీ లేదు ఈ సామాన్లు తెమ్మంటే పైకి వచ్చాను అని చెప్పి ఏమి చేయలేక కిందికి వచ్చేస్తాడు.


వైజయంతి: వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారు కానీ తెలియటం లేదు అనుకుంటుంది.


మరోవైపు ధాత్రి వాళ్ళని డాన్స్ చేస్తూ ఉండమను ఈలోపు నేను అత్తయ్య వెళ్లి పెన్ డ్రైవ్ తీసుకొచ్చేస్తాము అని చెప్తుంది నిషిక.


దివ్యాంక : కపుల్ డాన్స్ మీరు చెయ్యరా, ఏం మీరు కపుల్ కాదా అని రెచ్చగొట్టినట్లుగా అడుగుతుంది. ఎవరికి ఏం అనుమానం వస్తుందో అని డాన్స్ చేస్తారు ధాత్రి దంపతులు. కానీ నిషిక మీద ఒక కన్నేసి ఉంచుతారు.


ఇదే సందని భావించిన వైజయంతి, నిషిక కౌషికి రూంలోకి వెళ్లి పెన్ డ్రైవ్ ని వెతకడం ప్రారంభిస్తారు. మొత్తానికి పెన్ డ్రైవ్ దొంగిలిస్తారు.


అది గమనించిన ధాత్రి కౌషికిని హెచ్చరిస్తుంది. కౌషికి తన రూమ్ లోకి వెళుతుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. బయటికి వచ్చిన తర్వాత ధాత్రికి లోపల ఎవరూ లేరు అని చెప్తుంది కౌషికి.


మరి నిషిక వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అనుమాన పడుతుంది. బయటకి మాత్రం కౌషికి తో ఇప్పుడు హోలీ జరుగుతుంది చూస్తూ ఎంజాయ్ చేయండి అని చెప్తుంది ధాత్రి.


వెంటనే బూచికి సైగ చేయడంతో పైనుంచి వాటర్ బెలూన్ దివ్యాంక మీద పడేలాగా చేస్తాడు బూచి.


వెంటనే దివ్యాంక సీరియస్ అవుతుంది. నిషిక ఆమె దగ్గరికి వచ్చి అతను ఒక లూస్ వదిలేయండి ఇదిగోండి పెన్ డ్రైవ్ అని చెప్పి కామ్ గా ఆమె చేతిలో పెన్ డ్రైవ్ పెట్టేస్తుంది.


కౌషికి, ధాత్రి దివ్యాంకని తిట్టి పంపిస్తారు. వాళ్లతో అంతే పౌరుషంగా మాట్లాడి బయటికి వచ్చేస్తుంది దివ్యాంక. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.