Trinayani Today Episode గాయత్రీ దేవి తనకు కలలో కనిపించి తన చీరను కట్టుకోమని తనకు చెప్పిందని తిలోత్తమ విశాల్‌కు చీర అడుగుతుంది. విశాల్ అది తన తల్లి జ్ఞాపకం  అని ఇవ్వను అని చెప్తాడు. ఒక్కరోజు కట్టుకొని ఇచ్చేస్తా అని తిలోత్తమ అడుగుతుంది. ఇక నయని కూడా ఇచ్చేయండి బాబుగారు అని విశాల్‌కు చెప్తుంది. 


నయని: అవును బాబుగారు.. గాయత్రీ అమ్మగారే కలలోకి వచ్చి అత్తయ్యను అడిగారు అంటే మనం కాదు అనకూడదు. 
వల్లభ: పెద్ద మరదలు చెప్పాక తమ్మి కచ్చితంగా వింటాడు.
నయని: పర్లేదు బాబుగారు ఒక్కరోజే కదా పర్లేదు ఇవ్వండి. తీసుకురండి.
విశాల్: సరే.
సుమన: నువ్వే ఇమ్మంటున్నావా అక్క. ఆశ్చర్యంగా ఉంది. 


ఫ్లాష్‌బ్యాక్‌లో..


విశాల్ ఏదో ఫైల్ తీసుకొని వచ్చి నయనికి సంతకం పెట్టమంటే ఎందుకు పెట్టలేదు అని అడుగుతాడు. దీంతో నయని మనం మీటింగ్‌లు, ఆఫీసులు అంటూ మరీ అంత బిజీ అయిపోతే పిల్లలు మనల్ని గుర్తు పట్టరు అంటుంది. దీంతో విశాల్ సరే ఇంటి దగ్గరే మీటింగ్ ఏర్పాటు చేద్దాం సంతకం పెట్టు అంటాడు. నయని సరే అని పెడుతుంది. అప్పుడే నయనికి విశాల్‌ తిలోత్తమకు కాల్చినట్లు కనిపిస్తుంది. అయితే ఆ విషయం నయని విశాల్, హాసినిలకు చెప్పదు. ఇక విశాల్ నయనికి జాగ్రత్తలు చెప్పి ఫైల్ మ్యానేజర్‌కి ఇస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు.


హాసిని: చెల్లి విశాల్ చూడలేదు కానీ నువ్వు ఏదో కలత చెందావని నేను చూశాను. అందుకే టెన్షన్ తీసుకొని నీకు కళ్లు తిరిగినట్లు అయింది. ఏదైనా ప్రాబ్లమా.. ఎవరికైనా ఆపద వస్తుందా..
నయని: అవును అక్క.. వస్తుంది. బాబుగారి వల్ల.. 
హాసిని: ఎవరికి..
నయని: విశాల్ తిలోత్తమను కాల్చడం గురించి చెప్తుంది.
హాసిని: ఓర్ని ఇందుకా నువ్వు కంగారు పడుతున్నావ్.. 
నయని: అత్తయ్యని బాబుగారు షూట్ చేస్తున్నారు అక్క. 
హాసిని: కాల్చని చస్తే చచ్చింది. పెంచిన ప్రేమ అని ఇనాళ్లు విశాల్ ఆవిడని వెనకేసుకొస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చింది. గాయత్రీ అత్తయ్య బదులు ఆవిడ కొడుకే ఆమెను చంపాడు అనుకుంటారు జనం. 


ప్రస్తుతం..


వల్లభ: ఇవ్వడు అనుకున్నాం.. రేయ్ విశాల్ బాబు నువ్వు ఇచ్చేది చీర కాదు చిరంజీవి గాయత్రీదేవి ప్రాణం. 
విశాల్: నయని అమ్మ చీర తీసుకొచ్చాను. అని చెప్పి విశాల్ ఇవ్వడానికి వెళ్తుంటే గాయత్రీ పాప విశాల్ షర్ట్‌ పట్టుకొని లాగుతుంది. ఏంటమ్మా అని విశాల్ అడుగుతాడు. 
పావనా: అక్కయ్య చీరని ఇవ్వొద్దు అంటుంది అల్లుడు గాయత్రీ. 
సుమన: ఇది మరీ బాగుంది మాట రాని పిల్ల ఇవ్వొద్దు అని ఎలా అంది. అయినా గాయత్రీ అత్తయ్యే కలలో కనిపించి ఇవ్వమని చెప్తే ఆవిడ పేరు పెట్టుకున్న ఈ పిల్ల చేయి తగలగానే చీర ఇవ్వొద్దు అనడానికి సంకేతమని ఎలా చెప్తారు. 
విక్రాంత్: పసిపిల్లలు చెప్పకపోయినా వాళ్ల ముఖం చూసి చెప్పొచ్చు. 
హాసిని: అమ్మా గొడవ రాణి కాసేపు శాంతంగా ఉంటావా.. చీర ఇమ్మని చెల్లి చెప్పాక ఇక ఏ సెంటిమెంట్స్ పట్టించుకోవల్సిన అవసరం లేదు. 
నయని: అవును బాబుగారు గాయత్రీ పాప మీరు ఎత్తుకుంటారు అని పట్టుకుందే తప్ప మీరు అమ్మగారి చీర ఇవ్వకూడదు అని కాదు. పాపం చిన్న పిల్లకు ఏం తెలుసు.
విశాల్: మా అమ్మకు అన్నీ తెలుసు నయని తను చీర ఇవ్వొద్దు అనే ఆపింది. కానీ నువ్వు ఇవ్వమంటున్నావు అందుకే ఇస్తున్నాను.
తిలోత్తమ: అక్క నువ్వు కన్న కొడుకు నేను పెంచిన సుపుత్రుడు విశాల్ బాబు చేత నువ్వు ముచ్చట పడి కట్టుకున్న చీరని నాచేతుల్లోకి తీసుకున్నాను. సాయంత్రం ఈ చీర కట్టుకొని నీకు కనిపిస్తాను సరే..
వల్లభ: మమ్మీ పద సూర్య నమస్కారం చేద్దాం.
విక్రాంత్ర్: బయటకు వెళ్లారు ఏంటి.


చీర తీసుకొని తిలోత్తమ, వల్లభలు బయటకు వెళ్తారు. విశాల్ వాళ్లను ఫాలో అవుతాడు. వల్లభ కారు అద్దంలో చూసి తమ వెనక వస్తున్నాడు అంటాడు. తిలోత్తమకు ఈ విషయం చెప్పిగానే ఫాలో అవుతున్నాడా అని అడుగుతుంది. దారి మళ్లించమని చెప్తుంది. విశాల్ వల్లభకు అనుమానం వచ్చిందని అనుకొని కావాలనే వాళ్ల కంటే ముందు వెళ్తాడు. తర్వాత వాళ్లని ఫాలో అవ్వాలి అనుకుంటాడు. ఇక తిలోత్తమ వాళ్లు ఆ చీరను తీసుకొని అఖండ స్వామి దగ్గరకు బయల్దేరుతారు. అఖండ స్వామి కలశానికి కళ్లు పెట్టి ఏదో పూజకు సిద్ధం చేస్తారు. చాటుగా విశాల్ అందతా చూస్తుంటాడు. 


అఖండ: జాగ్రత్తగా ఉండు వల్లభ.
తిలోత్తమ: రేయ్ ఆగురా స్వామి అమ్మవారి పూజ చేస్తున్నారు.
అఖండ: అమ్మవారి పూజ కాదు తిలోత్తమ అలా కనిపించే ఈ తల్లి పేరు చూపులమ్మ. 
విశాల్: చూపులమ్మా... 
అఖండ: ఈ రోజు మీ ఇంట్లో ఉంటుంది. గాయత్రీ దేవి చీరను తీసుకొచ్చారు కదా తిలోత్తమ. చూపులమ్మ ముందు పెట్టండి చెప్తాను.. నెత్తురు అంటిన చీరని చూపులమ్మకి సమర్పిస్తాను. ఆ రక్తం మళ్లీ ఈ జన్మలో ఎక్కడుందో ఈ తల్లి దారిచూపిస్తుంది. 
విశాల్: మైగాడ్.. అంటే అమ్మ చీర కట్టుకొని దానికి అంటిన ఎండిపోయిన రక్తపు వాసనని చూపులమ్మ పసిగడుతుందా..
అఖండ: అక్షరాల నిజం ఆ నెత్తుటి వాసననే చూపులమ్మ పసిగడుతుంది. ఈ చీరను మీ అమ్మ కట్టుకొని సాయంత్రం వేళ దీపారాధన చేయాలి. 
విశాల్: మా అమ్మ చీర ఈ అమ్మ కట్టుకుంటే మా అమ్మకి గండం మొదలైనట్లే. 
అఖండ: చూపులమ్మ తల్లి కలశాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఉండే గాయత్రీ అమ్మ ఫొటోని చూస్తున్నట్లు పెట్టండి. ఈ ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయత్రీ దేవి పునర్జన్మలో కూడా చిదిమేయాలి అని చూసిన మీకు సాయం చేస్తున్న నాకు ముగ్గురిలో ఎవరో ఒకరికి ప్రాణహాని కలిగే ఆస్కారం కూడా ఉంది. ఎక్కడా పొరపాటు చేయకండి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ ఫిబ్రవరి 2nd: సత్యభామ సీరియల్: సత్య నిశ్చితార్థం అడ్డుకున్న క్రిష్‌, లాగిపెట్టి కొట్టిన సంపంగి - నవ్వుకుంటున్నా కాళీ!