Special Scene in Hanu Man: హను-మాన్‌.. సినిమాలోని ప్రతి ఒక్క సీన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాయి. హనుమంతుడి భారీ విగ్రహం, తేజ సజ్జకు మణి దొరికిన సీన్స్‌, ధ్యానంలో ఉన్న హనుమంతుడి సీన్స్ ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చాలామంది అన్న గూస్‌బంప్స్‌ వచ్చాయి అంటూ ప్రశాంత్‌ వర్మను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేశారు, కామెంట్లు పెట్టారు. 


ఆ సీన్‌ పడుంటే.. 


హను-మాన్‌ సినిమాలో ఫస్ట్‌ సీన్‌ మొదలైనప్పటి నుంచే ప్రేక్షకులు ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. పూర్తిగా సినిమాలో లీనమై చూశారు. ఒక భక్తిభావనలోకి వెళ్లిపోయి.. తర్వాత ఏమవుతుంది? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌ వేరే లెవెల్‌ అనే చెప్పాలి. విభీషణుడి మాటలకు ధ్యానంలో ఉన్న ఆంజనేయుడు మంచు కొండలు బద్దలుకొట్టుకుని అంజనాద్రికి బయలుదేరతాడు. పుణ్యక్షేత్రాలు, వివిధ ప్రదేశాలు దాటుకుంటూ వస్తాడు. ఆ సీన్లలో వారణాసి తదితర ప్రదేశాలు చూపించారు. అయితే, ఆంజనేయుడు అయోధ్య రామాలయం మీద నుంచి వస్తున్న షాట్‌ తీయాలి అనుకున్నారట మేకర్స్‌. కానీ, కొన్ని కారణాల వల్ల దాన్ని తీయలేకపోయారట. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రశాంత్‌వర్మ మాటలు తెగ వైరల్‌ అవుతున్నాయి. "అన్న ఆ సీన్‌ ఎందుకు పెట్టలేదు. పెట్టుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి అంటూ కామెంట్లు పెడుతున్నారు.  


ఇప్పటికే పూనకాలు.. 


ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హను-మాన్‌ ఒక అద్భుతం అనే చెప్పాలి. గ్రాఫిక్స్‌, సీన్లు ప్రతి ఒక్కటి వావ్‌ అనిపించాయి. ఎంతలా అంటే.. ఆంజనేయుడిని చూసిన ప్రతి ఒక్కరు ఒక తన్మయత్వంలోకి వెళ్లిపోయారు. పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఈ మధ్యే ఉప్పల్‌లోని ఏషియన్‌ మాల్‌లో ఒక మహిళ క్లైమాక్స్‌ చూసి పూనకం వచ్చినట్లు ఊగిపోయిన వీడియో వైరల్‌ అయ్యింది. ఇక ఇప్పుడు హిందువులకు ఎంతో ఎమోషనల్‌ అయిన రామమందిరం, అయోధ్య విజువల్స్‌ పెట్టి ఉంటే థియేటర్‌లో ప్రతి ఒక్కరు కచ్చితంగా మెస్మైరైజ్‌ అయ్యేవాళ్లు. అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బృందం తమ కలెక్షన్స్‌లో కొంతభాగం రామమందిరానికి డొనేట్‌ చేశారు. 


కొనసాగుతున్న రికార్డులు.. 


ఇక తక్కువ బడ్జెట్‌తో, అతి కొద్ది అంచనాలతో రిలీజ్‌ అయిన ఈ సినిమా.. ఇప్పుడు రికార్డుల ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. రిలీజై దాదాపు 18 రోజులు దాటుతున్నా.. చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. వీకెండ్స్‌లో అయితే, చాలా సిటీల్లో టికెట్లు దొరకడం కష్టంగా మారిపోయింది. ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు దాదాపు రూ.270 కోట్లు దాటిపోయాయి. ఇక ప్రస్తుతం సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న టీమ్‌.. అమెరికాలో మూడు రోజులు పాటు మీట్‌ అండ్‌ గ్రీట్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేశాయి. ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకుల మధ్యే సక్సెస్‌ పార్టీ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది చిత్రబృందం.  


3డీలోకి వచ్చే ఛాన్స్‌.. 


ఇంతటి అద్భుతమైన విజువల్స్‌ను 3డీ లో చూస్తే.. ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే, హనుమాన్‌ సినిమాని 3డీ లో ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌. ఈ సమ్మర్‌కి సినిమాని 3డీలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  


Also Read: 'డార్లింగ్' ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. 'కల్కి 2898 AD' షూటింగ్ ఎక్కడంటే?