Top 7 Anticipated Films of 2024: 2023 ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. ‘పఠాన్’, ‘జవాన్’, ‘యానిమల్’, ‘లియో’, ‘సలార్’, ‘గదర్ 2’ లాంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఈ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. గత ఏడాది రూ. 12 వేల కోట్లకు పైగా బిజినెస్ సాధించాయి. 2023 ఇచ్చిన జోష్ తో 2024లో పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తొలి నెల పూర్తయ్యింది. పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.  IMDB రేటింగ్స్ ప్రకారం.. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం..


1. కల్కి 2898 AD


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


2. కాంతార ఎ లెజెండ్: ఛాప్టర్  1


‘కాంతార’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార ఎ లెజెండ్: చాప్టర్ 1’. ఈ చిత్రంలో ‘కాంతార’లోని నటీనటులను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది తెలియకపోయినా, ఈ ఏడాదే విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు.  


3. పుష్ప: ది రూల్


అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. 2021లో వచ్చిన ‘పుష్ప’ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల కాబోతోంది.


4. ఇండియన్ 2


కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇండియన్’కు సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లేదంటే జూన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.  


5. సింగం ఎగైన్


‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత  రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగ్ ఎగైన్’. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   


6. బడే మియా చోటే మియా


బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్,  టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’ . అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


7. కంగువ


తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కంగువ’.  పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.  దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సూర్య 6 గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ఏకంగా 38 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read Also: ముందు నీ భర్త సినిమా గురించి మాట్లాడు, ఆమీర్ ఖాన్ మాజీ భార్యకు ‘యానిమల్’ డైరెక్టర్ కౌంటర్!