Director SV krishna Reddy Shocking Comments On 'Guntur Kaaram' : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ సినిమాపై ఆసక్తి నెలకొంది.


అయితే రిలీజ్ తర్వాత సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహేష్ ఫ్యాన్స్ ని తప్పితే నార్మల్ ఆడియన్స్ ని ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. కానీ సినిమాలో మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, డాన్స్.. అన్ని ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే, టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా రూ.230 కోట్లకి పైగా గ్రాస్ సాధించింది.


హీరోల ఇమేజ్‌కు తగ్గట్లు సినిమా చేస్తే ప్లాప్స్ తప్పవు


సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తాజా ఇంటర్వ్యూలో హీరోల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే దెబ్బ అయిపోతామని అన్నారు. నేను కథని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు.. హీరోల ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమా చేయాలనుకున్నప్పుడు దెబ్బైపోయాను. బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలని ప్రయత్నించడంతో కథ పక్కకి పోయింది. అందువల్లే టాప్ హీరో ఫ్లాప్ అయింది హీరోకి తగ్గట్లుగా ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథని కథలాగే తీయాలి. ‘యమలీల’ చిత్రంలో నేను కథ గురించే ఆలోచించా ఇంకేమి పట్టించుకోలేదు అని అన్నారు


'గుంటూరు కారం' రిజల్ట్ పై ఎస్వీ కృష్ణారెడ్డి కామెంట్స్


కథని నమ్ముకుని సినిమా చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని చెబుతూ ఉదాహరణగా గుంటూరు కారం రిజల్ట్ గురించి మాట్లాడారు ఎస్.వి.కృష్ణారెడ్డి. "త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలని కిందా మీదా పడ్డారు. అందువల్లే ‘గుంటూరు కారం’ పోయింది.  అదే హీరో ఇమేజ్‌ను పక్కన పెట్టి కథపై దృష్టి పెట్టుంటే సినిమా మంచి రిజల్ట్ అందుకునేది. కథని నమ్ముకుని సినిమా చేస్తే ఎప్పుడు పరాజయం అనేది ఉండదు" అంటూ చెప్పుకొచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి.  


నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'గుంటూరు కారం' స్ట్రీమింగ్


ఫిబ్రవరి 9 నుండి ‘గుంటూరు కారం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇటీవలే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ వాతావరణం వేడిగా మారబోతుంది ఎందుకంటే రౌడీ రమణ వచ్చేస్తున్నాడు. అతడు చాలా ఆవేశంలో ఉన్నాడు' అంటూ క్యాప్షన్‌తో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది. ఫిబ్రవరి 9 నుండి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'గుంటూరు కారం' స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.


Also Read : 'హనుమాన్' కోసం 75 సినిమాలను వదులుకున్నా - సంచలన విషయాలు వెల్లడించిన తేజా సజ్జా