Rajinikanth remuneration for Lal Salaam movie: బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామీ సృష్టించిన సినిమా 'జైలర్'. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 650 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. అటువంటి సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'లాల్ సలాం'. ఇందులో ఆయనది అతిథి పాత్ర. కుమార్తె ఐశ్వర్య దర్శకురాలు కావడంతో ఆయన కీలక పాత్ర చేశారు. అయితే... ఈ సినిమాకు ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా? నిమిషానికి కోటిన్నర ఛార్జ్ చేశారని కోలీవుడ్ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...
'లాల్ సలాం' కోసం 45 కోట్లు!?
'లాల్ సలాం'లో రజనీకాంత్ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించేది కేవలం 30 నిమిషాలు అని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అంటే... అరగంట పాటు సినిమాలో సూపర్ స్టార్ సందడి ఉంటుంది. అందుకు గాను ఆయన రూ. 45 కోట్లు తీసుకున్నారని కోలీవుడ్ ఖబర్. అంటే... నిమిషానికి కోటిన్నర అన్నమాట. మరి, థియేటర్లకు రజనీ గెస్ట్ అప్పియరెన్స్ ఏ మేరకు ప్రేక్షకులను తీసుకు వస్తుందో చూడాలి.
'లాల్ సలాం' సినిమాలో హీరోలు ఎవరంటే?
రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలు. డబ్బింగ్ సినిమాలు 'మట్టి కుస్తీ', 'అరణ్య', 'ఎఫ్ఐఆర్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు విష్ణు విశాల్. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించారు. సుభాస్కరన్ సమర్పణలో తమిళ చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మించింది.
Also Read: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!
క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం' రూపొందుతోందని సినిమా అనౌన్స్ చేసినప్పుడు వెల్లడించారు. అయితే... క్రికెట్ ఒక్కటే కాదని, ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో జరిగిన అల్లర్లు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది. ఇందులో రజనీకాంత్ ముస్లిం పెద్దగా, మొయిద్దీన్ భాయ్ పాత్రలో నటించారు. రజనీ సోదరిగా జీవితా రాజశేఖర్ కనిపించనున్నారు.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి! హాస్య బ్రహ్మ నటనతో ఏడిపించిన పాత్రలు ఏవో తెలుసా?
రజనీకాంత్ పాత్ర గురించి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు మాట్లాడుతూ ''లాల్ సలాం'లో ఓ శక్తివంతమైన పాత్ర ఉంది. దాన్ని మరోస్థాయికి తీసుకు వెళ్లే గొప్ప నటుడు కావాలని, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధం కారణంగా ఆ పాత్రలో నటించడానికి ఆయన ఓకే చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'లాల్ సలాం' డిఫరెంట్ మూవీ'' అని చెప్పారు.
Also Read: స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
'జైలర్', 'లాల్ సలాం' తర్వాత రజనీకాంత్ మరో సినిమాకు సంతకం చేశారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ ప్రొద్దుటూరులో జరుగుతోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.