Dunki OTT Premiere : బాలీవుడ్ 'బాద్‌షా' షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'డంకీ'. 'హీరో' సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న షారుక్.. రీఎంట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. గతేడాది ఆయన నటించిన 'ఫఠాన్', 'జవాన్' చిత్రాలు భారీ విజయం సాధించాయి. కలెక్షన్స్ పరంగా కూడా రికార్డు సృష్టించాయి. లాక్‌డౌన్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్ పడలేదు. ఓవైపు తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుంటే. బాలీవుడ్ వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయింది. ఇక ఆడియన్స్‌ను మెప్పించే సినిమాలు హిందీలో ఇవా? అనే ప్రశ్నలు వస్తున్న క్రమంలో 'పఠాన్'తో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు షారుక్.
ఊహించని విధంగా మూవీ రూ.1200 కోట్ల వసూళ్లు చేసి బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఆ తర్వాత వచ్చిన 'జవాన్' కూడా ఘనవిజయం సాధించింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన 'డంకీ' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోపై ఉన్న క్రేజ్ కారణంగా రిలీజ్‌కు ముందు ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కానీ రొటీన్ స్టోరీలైన్ కారణంగా ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అనుకున్నారు. అలా భారీ అంచనాల మధ్య రిలీజైన 'డంకీ' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే కేవలం రూ. 29 కోట్లు రాబట్టింది. ఇక మూవీ రిజల్ట్‌పై మేకర్స్‌లో టెన్షన్ మొదలైంది.
Also Read: జాన్వీకి మరో బిగ్ ఆఫర్ - మరో పాన్ ఇండియా హీరోతో రొమాన్స్?
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ థియేట్రికల్ రన్‌లో 470 కోట్ల కలెక్షన్స్ సాధించింది. గత ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. సలార్‌కు పోటీకి దిగిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న రన్ టైంలో మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతుంది. డంకీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'డంకీ' ఓటీటీ రైట్స్‌ను జియో సినిమా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందట. దీంతో, త్వరలోనే డిజిటల్ వేదికగా డంకీ స్ట్రీమింగ్ చేసేందుకు జియో సినిమా ప్లాన్ చేస్తున్నట్టుతెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందట.
'డంకీ' డిజిటల్ రైట్స్
గతేడాది షారుక్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో డంకీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. డంకీ ఓటీటీ హక్కులను జియో సినిమా 155 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. దీంతో ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో అత్యధిక ధరకు ఓటీటీ రైట్స్ దక్కించుకున్న మూవీగా 'డంకీ' రికార్డ్ క్రియేట్ చేసింది. షారుఖ్ కెరీర్‌లో కూడా హయ్యెస్ట్ రేట్‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా డంకీ నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను టీ సిరీస్ 36 కోట్లకు కొనుగోలు చేసింది.
కథంటంటే..
హర్డీ సింగ్(షారుక్ ఖాన్) మన్నుతో పాటు ముగ్గురు స్నేహితులు తమ సమస్యల నుంచి గట్టెక్కడానికి 'డంకీ' గుండా ఇంగ్లాండ్‌కు వలస వెళతారు. ఈ క్రమంలో జర్నీలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? మన్ను హర్డీ సింగ్ ఇంగ్లండ్ నుంచి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చాడు. లండన్‌లో ఉన్న ప్రియురాలిని కలవాలని అనుకున్న సుఖీ జీవితం ఏమైంది? హర్డీ సింగ్, మన్ను మళ్లీ కలుసుకున్నారా? లేదా? అన్నదే కథ.