Janhvi Kapoor Bags One More Big Offer In Telugu : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'ధడక్‌' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత 'గుంజన్‌ సక్సేనా, రూహి, మిలీ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా 'తంగం'అనే పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే దేవర నుంచి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో జాన్వీ కపూర్ నటిస్తున్న ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్టులో నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజా సమాచారం ప్రకారం జాన్వి కపూర్ కి తెలుగులో మరో బిగ్ ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.


'RC16' లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫైనల్


'దేవర' మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతున్న జాన్వీ కపూర్ రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతుంది. బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకి కథానాయిక జాన్వీ కపూర్ ని మూవీ టీమ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, సమంతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదట. ఇటీవలే బుచ్చిబాబు జాన్వి కపూర్ కి స్టోరీ నెరేట్ చేయగా, 'RC16' లో భాగం అయ్యేందుకు జాన్వి కూడా అంగీకరించినట్లు తాజా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ జాన్వీ కపూర్ కి రావడం విశేషం. ఈ రెండు ప్రాజెక్ట్స్ తో తప్పకుండా ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.


వచ్చే నెల నుంచే 'RC16' షూటింగ్


'RC16' మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత చిన్న వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు చెబుతున్నారు. రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు పాత్రను మించేలా RC16 లో చరణ్ రోల్ ని డిజైన్ చేశారట బుచ్చిబాబు.


విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగనున్న ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ సేతుపతి తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.


Also Read : సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి టైటిల్ ఫిక్స్ - ‘జాక్’గా వస్తున్న స్టార్ బాయ్!