Gaami Movie Release Date Lock: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. క్లాస్, మాస్ ఏదైనా ఆ క్యారెక్టర్‌ పరకాయ ప్రవేశం చేస్తాడు మాస్‌ కా దాస్‌. అయితే తన బాడీ లాంగ్వెజ్‌కి అప్ట్‌ అయ్యే మాస్‌ రోల్స్‌ చేస్తూ వస్తున్న విశ్వక్‌ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. మాస్‌ కా దాస్‌గా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న విశ్వక్‌ ఈసారి 'గామి' అంటూ సరికొత్త జానర్‌తో వస్తున్నాడు.


రిలీజ్ ఎప్పుడంటే..


ఇందులో విశ్వక్‌ అఘోరగా కనిపించనున్నట్టు ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చేసింది. సో తన మాస్‌ ఇమేజ్‌ పూర్తి భిన్నంగా వస్తున్న సినిమా ఇది కావడంతో గామిపై అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్‌గానే విశ్వక్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అప్పటి నుంచి మూవీ మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది.  విశ్వక్‌ సేన్‌ లుక్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతుంది. ఈ క్రమంలో గామి నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి సినీ లవర్స్‌లో క్యూరియసిటీ పెంచారు. మహా శివరాత్రి సందర్భంగా 'గామి'ని థియేటర్లోకి తీసుకువస్తున్నారు. మార్చి 8న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మూవీ యూనిట్‌ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న 'డంకీ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..


అఘోరగా విశ్వక్ సేన్


గామిని కొత్త డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నారు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ 'శంకర్' అనే అఘోరాగా నటిస్తున్నాడట. ఇందులో అతడి క్యారెక్టర్‌ చాలా విచిత్రంగా ఉండబోతుందట. మానవులు స్పర్శకు భయపడే అఘోరా అని తెలుస్తుంది. రీసెంట్‌గా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు మేకర్స్‌. ఇదోక అడ్వేంచర్‌ డ్రామా అని,  ఈ కథ అఘోరాల చూట్టు తిరుతుందన్నాడు. అంతేకాదు ఇందులో ఇంకా రెండు విభిన్న పాత్రలు ఉన్నాయని, వాటికి సంబంధించిన పోస్టర్స్ కూడా త్వరలోనే పరిచయం చేస్తామన్నారు. అలాగే సినిమా విడుదల తేదీ, ఇతర తారాగాణంపై కూడా త్వరలోనే ప్రకటన ఇస్తామని మేకర్స్‌ తెలిపారు.


'కలర్‌ ఫొటో' ఫేం చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎం జి అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్‌ రీసెంట్‌గా నటించిన  'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ ఊరమాస్ లో కనిపించబోతున్నారు. గోదావరి బ్యాగ్రౌండ్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.