'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల?


సాయి రాజేష్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'బేబీ' (Baby Movie). జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో'కు ఆయనే రచయిత. ఆ సినిమా తర్వాత సాయి రాజేష్ నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో విజయ్ దేవరకొండ (Anand Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ హీరో. 'అల వైకుంఠపురములో' సహా కొన్ని సినిమాల్లో, 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్' వెబ్ సిరీస్‌లో నటించిన వైష్ణవి చైతన్య ఈ సినిమాతో కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ మరో హీరో. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా (Baby Review) ఎలా ఉందంటే? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


నాయకుడు రివ్యూ: రెండు ఆలోచనల మధ్య యుద్ధం - ఫహాద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్ సినిమా ఎలా ఉంది?


భారతీయ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న దర్శకుల్లో మారి సెల్వరాజ్ ఒకరు. తన సినిమా ఎప్పుడు వచ్చినా ఒక వర్గం ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా ఉంటారు. తన సినిమాల్లో ప్రజా సమస్యలను కూడా టచ్ చేస్తారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా చేసే అవకాశం మారి సెల్వరాజ్‌కు ఇచ్చారు. తమిళనాట ‘మామన్నన్’గా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే పెద్ద సక్సెస్ అయింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, వడివేలు, కీర్తి సురేష్ వంటి భారీ స్టార్ క్యాస్ కూడా ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


'మహావీరుడు' రివ్యూ : రాజకీయ నేపథ్యంలో తీసిన కామెడీ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?


తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన 'రెమో', 'సీమ రాజా', 'వరుణ్ డాక్టర్', 'డాన్' సినిమాలు తెలుగులోనూ ఆయనకు విజయాలు అందించాయి. ఆయన నటించిన తాజా సినిమా 'మహావీరుడు' (Mahaveerudu Movie). ఇందులో శంకర్ కుమార్తె అదితి హీరోయిన్. సునీల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


మెగా వారసురాలి కోసం టెంపుల్ ట్రీ నర్సరీ, చెర్రీ-ఉపాసనల వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా డిజైన్!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు గత నెలలో ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా మనవరాలికి ‘క్లిన్ కారా కొణిదెల’ అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారసురాలు వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో సంతోషం రెట్టింపైంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఉపాసన.. తన గారాలపట్టికి సంబంధించిన ప్రతీ విషయాన్ని మెమరబుల్ గా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బేబీ క్లిన్ కారా కోసం ఇంట్లో సరికొత్త టెంపుల్ ట్రీ నర్సరీని డిజైన్ చేయించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


అందుకే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పా, ఆ హీరోతో గొడవపై స్పందించిన ‘సింహాద్రి’ హీరోయిన్ అంకిత


సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలైనా వాటితోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్స్ కి అవకాశాలు రాక ఎంతోమంది ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లిళ్లు చేసుకుని  స్థిరపడిపోయారు. అలాంటి వాళ్లలో హీరోయిన్ అంకిత కూడా ఒకరు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ హీరోయిన్. తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టింది. 'లాహిరి లాహిరి లాహిరిలో' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది అంకిత. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హీరోయిన్గా అంకితకు కెరీర్ ఆరంభంలో మంచి అవకాశాలే వచ్చాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)








ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial